Nissan Magnite: రూ.6 లక్షల్లో అద్భుతమైన SUV.. అమ్మకాల్లో నంబర్ 1

Nissan Magnite
x

Nissan Magnite

Highlights

Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) మరోసారి కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది.

Nissan Magnite: ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) గత నెల అంటే అక్టోబర్ 2024లో కార్ల విక్రయాల డేటాను విడుదల చేసింది. నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) మరోసారి కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది. ఈ కాలంలో నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) వార్షికంగా 21 శాతం పెరుగుదలతో మొత్తం 3,119 యూనిట్ల కార్లను విక్రయించింది. నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. దీనికి కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నైట్ పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 72bhp పవర్‌ను, 96Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. రెండవది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో డిజైన్ చేశారు. ఇది గరిష్టంగా 100bhp శక్తిని, 160Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ రెండు వేరియంట్స్ కార్ల ఇంజన్స్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూపొందించినవే. నిస్సాన్ మాగ్నైట్ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. మార్కెట్లో, నిస్సాన్ మాగ్నైట్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి SUVలతో పోటీపడుతుంది.

మరోవైపు, కారు క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించారు. ఇది కాకుండా, కారు లోపలి భాగంలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత కోసం, నిస్సాన్ మాగ్నైట్‌లో 6-ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందించారు. నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌లో రూ. 5.99 లక్షల నుండి రూ. 11.50 లక్షల వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories