2024 Maruti Suzuki Dzire Crash Test: క్రాష్ టెస్ట్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన కొత్త మారుతి డిజైర్.. కళ్లు మూసుకొని కొనేయండి

2024 Maruti Suzuki Dzire Crash Test
x

2024 Maruti Suzuki Dzire Crash Test

Highlights

2024 Maruti Suzuki Dzire Crash Test: కొత్త మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేసింది.

2024 Maruti Suzuki Dzire Crash Test: ఎస్‌యూవీ సెగ్మెంట్ యుగంలో మారుతి సుజుకి తన కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ (డిజైర్)ని నవంబర్ 11న భారతదేశంలో విడుదల చేయబోతోంది. అయితే డిజైర్ ఇప్పుడు కుటుంబ తరగతి కంటే టాక్సీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డిజైన్ పరంగా కూడా డిజైర్ ఇంతకు ముందు ఆకట్టుకోలేదు, ఇప్పుడు కూడా ఆకట్టుకోలేదు. దీని ఫోటోలు, వీడియోలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. మారుతి ఈ కారును ఎలాగైనా హిట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. దీని కోసం కంపెనీ దానిని ప్రారంభించక ముందే G-NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేసింది. ఇప్పుడు పెద్ద విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకు డిజైర్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ దక్కలేదు, కానీ ఈసారి డిజైర్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Dzire Crash Test

విడుదలకు ముందే కొత్త మారుతి సుజుకి డిజైర్ గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేసింది. G-NCAP వెబ్‌సైట్ ప్రకారం.. టెస్టింగ్‌ మారుతి డిజైర్ 2024 యూనిట్ భారతదేశంలో తయారు చేశారు. కొత్త డిజైర్ వివిధ కోణాల్లో క్రాష్ టెస్ట్ జరిపింది. ఆ తర్వాత సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ పొందింది. విశేషమేమిటంటే భద్రత కోసం ఫుల్ 5 పాయింట్లు ఇచ్చిన కంపెనీ మొదటి వాహనం ఇదే. మారుతి డిజైర్ క్రాష్ టెస్ట్ తర్వాత పెద్దలకు 34 పాయింట్లకు 31.24 పాయింట్లు సాధించింది. పిల్లల భద్రత విషయంలో కూడా 49కి 39.20 స్కోర్‌ను అందించారు.

మారుతి సుజుకి కొత్త డిజైర్ సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడితే కొత్త డిజైర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇవే కాకుండా ఇది EBD, 3 పాయింట్ల సీట్ బెల్ట్, సుజుకి హార్ట్‌టెక్ బాడీ, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ISOFIX చైల్డ్ ఎంకరేజ్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ వంటి భద్రతా ఫీచర్లును కలిగి ఉంటుంది.

కొత్త డిజైర్ కోసం బుకింగ్‌లు అధికారికంగా ప్రారంభమయ్యాయి, దీనిని రూ. 11,000 చెల్లించి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త డిజైర్ 11 నవంబర్ 2024న మార్కెట్‌లోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories