World's Most Expensive Bike: ప్రపంచంలోనే ఖరీదైన బైక్‌.. గంటకు 300 కిమీ వేగంతో దూసుకుపోతుంది..!

Neiman Marcus Limited Edition Fighter is the Worlds Most Expensive Bike
x

World's Most Expensive Bike: ప్రపంచంలోనే ఖరీదైన బైక్‌.. గంటకు 300 కిమీ వేగంతో దూసుకుపోతుంది..!

Highlights

World's Most Expensive Bike: సాధారణంగా మనం ఖరీదైన బైక్‌ల గురించి మాట్లాడినప్పుడల్లా హార్లీ డేవిడ్‌సన్, బీఎమ్‌డబ్ల్యూ వంటి బైక్‌లు గుర్తుకు వస్తాయి.

World's Most Expensive Bike: సాధారణంగా మనం ఖరీదైన బైక్‌ల గురించి మాట్లాడినప్పుడల్లా హార్లీ డేవిడ్‌సన్, బీఎమ్‌డబ్ల్యూ వంటి బైక్‌లు గుర్తుకు వస్తాయి. ఈ కంపెనీల ఖరీదైన బైక్‌లను మనం సినిమాల్లో కూడా చూశాం, అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్‌ల తయారీ కంపెనీ పేరు నీమాన్ మార్కస్ కంపెనీ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కంపెనీ ఒక లగ్జరీ బ్రాండ్ స్టోర్.

ఆటోమొబైల్ కంపెనీ కానప్పటికీ నీమాన్ మార్కస్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రోల్స్ రాయిస్ ఖరీదైన కార్ల కంటే కంపెనీ ఈ బైక్ ధర చాలా ఎక్కువ , ఇది తెలిసి ప్రపంచం మొత్తం చాలా ఆశ్చర్యపోయింది. కంపెనీ ఈ బైక్‌కు నీమాన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ అని పేరు పెట్టింది. దీని 45 యూనిట్లు మాత్రమే మార్కెట్లో వేలానికి ఉంచింది.

లగ్జరీ బ్రాండ్ స్టోర్ కంపెనీ నీమాన్ మార్కస్ బైక్‌ను తయారు చేయాలని భావించినప్పుడు, వారు దాని కోసం వేలం నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుండి ధనికులు ఈ వేలంలో పాల్గొన్నారు, బిడ్డింగ్ 100 రెట్లు మించిపోయింది. ఈ బైక్‌కు బిడ్ రూ.91 కోట్లు.

ఈ బైక్ మొత్తం బాడీ, ఇంజన్‌ను చేతితో తయారు చేశారు. దీని తయారీకి టైటానియం, అల్యూమినియం, కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. దీన్ని తయారు చేసేందుకు పాతకాలపు యుద్ధ విమానాల డిజైన్‌ను అనుసరించారు. ఈ బైక్‌లో 2000సీసీ (2.0 లీటర్ వి ట్విన్) పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది బైక్‌ను గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగానికి తీసుకెళ్తుంది. దీని ఇంజన్ 131 బిహెచ్‌పి పవర్‌ను రిలీజ్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories