EV Car: రూ. 13 వేలు పెరిగిన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరుగా..!

MG Comet EV Prices Increased in India check features
x

EV Car: రూ. 13 వేలు పెరిగిన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరుగా..!

Highlights

కామెట్ EV గురించి మాట్లాడితే, MG ఎక్స్‌క్లూజివ్ (ఫాస్ట్ ఛార్జర్‌తో) వేరియంట్ ధరను రూ. 13,000 పెంచింది.

MG Comet EV Price: ఎంజీ మోటార్ ఇండియా తన ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది. ఇది తక్షణం అమలులోకి రానున్నాయి. ఆస్టర్, హెక్టర్ శ్రేణి ధరల పెంపు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం.

కామెట్ EV గురించి మాట్లాడితే, MG ఎక్స్‌క్లూజివ్ (ఫాస్ట్ ఛార్జర్‌తో) వేరియంట్ ధరను రూ. 13,000 పెంచింది. అలాగే, దాని ఎక్స్‌క్లూజివ్, ఎక్సైట్ (ఫాస్ట్ ఛార్జర్‌తో) వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 11,800లు, రూ. 11,000 పెంచింది.

అన్ని ఇతర MG కామెట్ EV వేరియంట్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఈ పెరుగుదలతో, బ్రాండ్ అత్యంత సరసమైన ఎంజీ కామెట్ ఈవీ ఇప్పుడు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అదనంగా, పరిమిత-ఎడిషన్ ఎవర్‌గ్రీన్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories