New Swift Discounts: కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. స్విఫ్ట్‌పై భారీగా ఆఫర్లు..!
New Swift Discounts: మారుతీ స్విఫ్ట్ తన కొత్త స్విఫ్ట్‌పై రూ.33,100 డిస్కౌంట్ ఇస్తుంది. ఒక లీటర్‌లో 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
New Swift Discounts: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో మారుతీ సుజికీ కూడా ఒకటి. కంపెనీ ఆఫర్డ్ ప్రైస్‌లో మార్కెట్‌లోకి కార్లను తీసుకొస్తుంటుంది. రోడ్లపై ఎటు చూసినా ఈ కార్లే దర్శనమిస్తాయి. ఈ క్రమంలోనే మారుతీ కొత్త స్విఫ్ట్ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ కారు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. అయితే తన కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ కారుపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు మీరు ఈ కారు కొనుగోలుపై వేల రూపాయలను సేవ్ చేయవచ్చు. స్విఫ్ట్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఈ నెలలో కొత్త స్విఫ్ట్ కొనుగోలు చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ పొందుతారు. కంపెనీ కొత్త స్విఫ్ట్ మాన్యువల్ వేరియంట్‌పై రూ.33,100 తగ్గింపు ఇస్తుంది. కాగా గత నెలలో ఈ తగ్గింపు రూ.15000 మాత్రమే. ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఇంకా క్లియర్ చేయని స్విఫ్ట్ పాత స్టాక్‌పై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం మీరు డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. కొత్త స్విఫ్ట్‌లో సేఫ్టీ ఫీచర్లకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
కొత్త స్విఫ్ట్ 1.2L 3 సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 81.6PS పవర్, 112 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. మైలేజీ గురించి చెప్పాలంటే స్విఫ్ట్ ఒక లీటర్‌లో 26 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుండి రూ.9.64 లక్షల వరకు ఉంది. ఇందులో 6 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
మీరు మీ అవసరానికి అనుగుణంగా మోడల్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. కారు పర్ఫామెన్స్ చాలా స్పోర్టీగా ఉంటుంది. దాని క్యాబిన్ కూడా ప్రీమియం, మంచి స్పేస్‌తో వస్తుంది. దీనిలో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. కారు వెనుక ప్రయాణీకులకు AC వెంట్స్ ఉన్నాయి. కానీ ఏసీ అంతా ఎఫెక్ట్‌గా పనిచేయడం లేదు. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
స్విఫ్ట్‌తో పాటు ఈ నెలలో గ్రాండ్ విటారాపై కూడా డిస్కౌంట్ లభిస్తుంది ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడం ద్వారా మీరు రూ. 1.28 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు మారుతి సుజుకి ఫ్రంట్‌పై రూ. 83,000, బాలెనోపై రూ. 46,000 డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఇగ్నిస్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు రూ.52,000 తగ్గింపు లభిస్తోంది. అన్ని డిస్కౌంట్ల గురించి సమాచారం కోసం కంపెనీ షోరూమ్‌ని సంప్రదించండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire