New Maruti Dzire: మైలేజ్ రారాజు.. కొత్త మారుతి సుజికి డిజైర్ వచ్చేస్తోంది..!

New Maruti Dzire
x

New Maruti Dzire

Highlights

New Maruti Dzire: మారుతి సుజికి కొత్త జనరేషన్ డిజైర్‌ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 6.50 లక్షల నుండి రూ. 10.50 లక్షల మధ్య ఉంటుంది.

New Maruti Dzire: మారుతి సుజుకి భారత మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించబోతోంది. తన కొత్త జనరేషన్ స్విఫ్ట్‌ను ప్రారంభించిన తర్వాత కంపెనీ ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన డిజైర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే మారుతి డిజైర్‌ను ఇటీవలే టెస్ట్ చేశారు. కొత్త కారు డిజైన్, ఫీచర్లు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. నివేదికల ప్రకారం, దీపావళి తర్వాత ఈ కారును విడుదల చేయవచ్చు. ఈ కారు మారుతి సుజుకి కొత్త హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. దీని డిజైన్, ఫీచర్లు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

కొత్త జనరేషన్ మారుతి సుజుకి డిజైర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది పెద్ద గ్రిల్, ఫుల్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED ఫాగ్ లైట్లు, ముందు, వెనుక బంపర్‌లతో కూడిన వినూత్న అల్లాయ్ వీల్స్, ట్రై-యారో LED టైల్‌లైట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది కాకుండా న్యూ జెన్ మారుతి డిజైర్ లోపలి భాగంలో లేత గోధుమరంగు అప్హోల్స్టరీ, టాప్ స్పెక్ వేరియంట్‌లో 9 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్, 4.2-అంగుళాల డిజిటల్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు.

కొత్త మారుతి సుజుకి డిజైర్ సెడాన్‌లో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 82 PS హార్స్ పవర్, 108 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ కారులో 5 మంది హాయిగా కూర్చుని సుదూర నగరాలకు ప్రయాణించవచ్చు.

కొత్త మారుతి సుజుకి డిజైర్ సెడాన్ సరసమైన ధరలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తుంది. నివేదిక ప్రకారం దీని ధర రూ. 6.50 లక్షల నుండి రూ. 10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. భారతీయ మార్కెట్లో న్యూ జెన్ మారుతి డిజైర్ హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లతో పోటీ పడుతోంది. ఇది కాకుండా కంపెనీ పెట్రోల్ మోడల్ తర్వాత వచ్చే CNG వెర్షన్‌లో మారుతి డిజైర్‌ను కూడా విడుదల చేస్తుంది.

దీనికి ముందు మారుతీ సుజుకి స్విఫ్ట్ CNG హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విడుదల చేసింది. దీని ధర రూ. 8.19 లక్షల నుండి రూ. 9.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది VXI, VXI (O), ZXI వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్త స్విఫ్ట్ 1.2 లీటర్ పెట్రోల్/CNG ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. ఇది కిలోకు 32.85 కిమీ మైలేజీని ఇస్తుంది. ఇందులో 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ హోల్డ్ అసిస్ట్, వెనుక AC వెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories