Swift vs Baleno: కంపెనీ, ధర ఒక్కటే.. కానీ ఆ 2 కార్ల మధ్య విపరీతమైన పోటీ..!

Maruti Suzuki Swift vs Maruti Suzuki Baleno check for all Details
x

Swift vs Baleno: కంపెనీ, ధర ఒక్కటే.. కానీ ఆ 2 కార్ల మధ్య విపరీతమైన పోటీ..!

Highlights

Swift vs Baleno:మారుతి సుజుకి స్విఫ్ట్‌, మారుతి సుజుకి బాలెనో రెండూ ఒకే కంపెనీకి చెందిన కార్లు. కానీ మార్కెట్‌లో ఈ రెండింటి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.

Swift vs Baleno: మారుతి సుజుకి స్విఫ్ట్‌, మారుతి సుజుకి బాలెనో రెండూ ఒకే కంపెనీకి చెందిన కార్లు. కానీ మార్కెట్‌లో ఈ రెండింటి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ రెండు కార్ల ధరలు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. అయినప్పటికీ మిగతా వాటితో పోలిస్తే ఈ రెండు కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రెండు కార్ల మధ్య తేడాలు, ఫీచర్ల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మారుతీ సుజుకి కంపెనీ మొట్టమొదటి స్విఫ్ట్ కారును 2005లో విడుదల చేసింది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు స్విఫ్ట్ సరికొత్త వెర్షన్ 2024 విడుదలైంది. దీనిని సరికొత్త జనరేషన్ సెట్టింగ్ లతో అప్‌డేట్ చేశారు. బయట హెడ్ ల్యాంపులు, బంపర్ల నుంచి డోర్ హ్యాండిళ్ల వరకూ కొత్తగా సెట్‌చేశారు. బాలెనో కారు పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఈ రెండు కార్లలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టైల్‌మ్యాంప్‌లు ఉన్నాయి. బాలెనో కారు 16 అంగుళాలు, స్విఫ్ట్ 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఉన్నాయి.

స్విఫ్ట్ 3,860 మిమీ పొడవు, 1,735 మిమీ వెడల్పు, 1,520 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. బాలెనో 3,990 మిమీ పొడవు, 1745 మిమీ వెడల్పు,1500 మిమీ ఎత్తు ఉంటుంది. స్విఫ్ట్ కంటే బాలెనో 20 మిమీ తక్కువ ఎత్తులో ఉంటుంది. స్విఫ్ట్ లో కొత్త ఇంటీరియర్స్‌ అప్‌డేట్ చేశారు. సరికొత్త డ్యాష్‌బోర్డ్‌ అమర్చారు. 9 అంగుళాల టాబ్లెట్ స్టైల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బాగుంది. కలర్ ఎమ్ఐడీ స్క్రీన్‌తో పాటు కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. బాలెనోలో మాదిరిగానే ఎయిర్ కండిషనింగ్ నియంత్రణలు ఉన్నాయి. స్విఫ్ట్ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ లో వస్తుంది.

కొత్త స్విఫ్ట్ 1.2L ఎన్ఏ పెట్రోల్ మూడు సిలిండర్ Z-సిరీస్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది 80 బీహెచ్ పీ, 111.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు బాలెనోలో 1.2L ఎన్ఏ పెట్రోల్ నాలుగు సిలిండర్ కే-సిరీస్ ఇంజిన్ ఉంది. దీని నుంచి 88.5 బీహెచ్ పీ, 113 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి అవుతుంది. బాలెనో సీఎన్ జీ ఆప్షన్‌ కూడా ఉంది. మారుతీ స్విఫ్ట్ కు మాత్రం లేదు. కొత్త మారుతీ స్విఫ్ట్ ప్రారంభ ధర 6.49 లక్షలు కాగా, బాలెనో రూ. 6.66 లక్షలుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories