Maruti Suzuki: మారుతి కార్లు ఇప్పుడే కొనేయండి.. జనవరి 2025 నుండి 4శాతం పెరగనున్న ధరలు..!

Maruti Suzuki India Car Price Hike From January 2025
x

Maruti Suzuki: మారుతి కార్లు ఇప్పుడే కొనేయండి.. జనవరి 2025 నుండి 4శాతం పెరగనున్న ధరలు..!

Highlights

Maruti Suzuki: దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా తన కార్ల ధరలను జనవరి 2025 నుండి పెంచనున్నట్లు ప్రకటించింది.

Maruti Suzuki: దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి ఇండియా తన కార్ల ధరలను జనవరి 2025 నుండి పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. కంపెనీ కార్లను కొనుగోలు చేయడం జనవరి 2025 నుండి 4శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కార్ల తయారీకి అదనపు ఖర్చు, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండడంతో ధరలను పెంచాలని నిర్ణయించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఈ వార్త వచ్చిన తర్వాత కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపిస్తోంది.

నవంబర్ 2024లో మారుతి సుజుకి ఇండియా అతిపెద్ద కార్లను విక్రయించే సంస్థ. గత నెలలో దేశీయ మార్కెట్లో కంపెనీ మొత్తం 1,52,898 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 1,41,489 యూనిట్లుగా ఉంది. కంపెనీ గత నెలలో 28,633 యూనిట్లను ఎగుమతి చేసింది. మొత్తంగా, కంపెనీ మొత్తం అమ్మకాలు 1,81,531 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్ 2023లో కంపెనీ మొత్తం 1,64,439 యూనిట్లను విక్రయించింది. అంటే వార్షిక ప్రాతిపదికన 10.39శాతం వృద్ధిని సాధించింది. అరేనా, నెక్సా డీలర్‌షిప్‌ల సహాయంతో కంపెనీ మొత్తం 17 మోడళ్లను విక్రయిస్తుంది.

రూ.25 వేలు పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధర

హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జనవరి 2025లో తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతోంది. కంపెనీ తాజాగా ధరల పెంపును ప్రకటించింది. హ్యుందాయ్ తన అన్ని మోడళ్ల ధరలను పెంచబోతోంది. 25,000 వరకు పెంచవచ్చని కంపెనీ సమాచారం. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, లాజిస్టిక్స్‌లో అధిక ఖర్చులు ఈ ధరల పెంపునకు కారణమని కంపెనీ పేర్కొంది.

2శాతం మేర ధర పెరగనున్న నిస్సాన్ కార్ల ధర

నిస్సాన్ మోటార్ ఇండియా తాజాగా దేశంలో 5 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. కంపెనీ కోసం దాని కొత్త మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ మార్కెట్‌తో పాటు దేశం వెలుపల కూడా ఇష్టపడుతోంది. ఇప్పుడు కంపెనీ తన కార్ల ధరలను పెంచబోతోంది. కంపెనీ తన కార్ల ధరలను 2శాతం వరకు పెంచబోతోంది. కొత్త ధరలు జనవరి 2025 నుండి అమలులోకి రావచ్చు.

మరింత ప్రియం కానున్న బీఎండబ్ల్యూ కార్లు

ఇప్పుడు జనవరి 2025 నుండి పెరుగుతున్న కార్ల ధరల జాబితాలో బీఎండబ్ల్యూ ఇండియా పేరు కూడా చేరిపోయింది. జనవరి 2025 నుండి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. వచ్చే ఏడాది నుంచి వేరియంట్‌ను బట్టి కంపెనీ తన కార్ల ధరలను 3శాతం ధర పెంచబోతోంది. ధర పెంచడం వెనుక ఎలాంటి కారణాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే, దీనికి కారణం అధిక కార్యాచరణ ఖర్చులు కావచ్చు. బీఎండబ్ల్యూ భారతీయ మార్కెట్లో 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ LWB, 5 సిరీస్, 7 సిరీస్, X1, X3, X5, X7, M340i వంటి అనేక రకాల కార్లను విక్రయిస్తోంది. ఇవన్నీ దేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడతాయి.

అదే బాటలో మెర్సిడెస్ బెంజ్ కూడా..

2025 ప్రారంభానికి ముందే మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ తన మోడల్ శ్రేణిలో జనవరి 1, 2025 నుండి ధరలను పెంచుతుంది. అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ధరలను 3శాతం వరకు పెంచుతుంది. పెరుగుతున్న మెటీరియల్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడి, లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో నిర్వహణ వ్యయం పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories