Maruti Suzuki Price Cuts: మారుతీ కార్లపై భలే ఆఫర్లు.. ఇక లేట్ ఎందుకు..?

Maruti Suzuki Price Cuts
x

Maruti Suzuki Price Cuts

Highlights

Maruti Suzuki Price Cuts: మారుతీ సుజికీ ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో కార్ల ధరలను తగ్గించింది. ఇవి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందిస్తాయి.

Maruti Suzuki Price Cuts: మీరు మారుతీ సుజుకీ కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు మీకు శుభవార్త ఉంది. మారుతీ సుజుకీ తన కార్ల ధరలను భారీగా తగ్గించింది. అందులో ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్లు ఉన్నాయి. నేటి నుండి S-Presso LXI పై రూ. 2,000, Alto10 VXI పై రూ. 6,500 తగ్గింది. సేల్స్ పెంచుకునేందకు కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతీ సుజుకి గత నెల (ఆగస్టు 2024) అమ్మకాలలో భారీ క్షీణతను చవిచూసింది. గత నెల (ఆగస్టు 2024) మారుతి 181,782 యూనిట్లను విక్రయించగా గత ఏడాది ఇదే కాలంలో మారుతి 189,082 యూనిట్లను విక్రయించింది. అందుకే ఈసారి మారుతి అమ్మకాలు 3.9 శాతం తగ్గాయి.

Maruti ALto K10 Price, Features
మారుతీ సుజుకీ ఆల్టో కె10 చిన్న కుటుంబానికి మంచి కారు. ఈ కారులో శక్తివంతమైన 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు CNGలో కూడా అందుబాటులో ఉంది. ఇది 33.85 km/kg మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. భద్రత కోసం కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు EBD,ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఢిల్లీలో ALto K10C VXI CNG ఎక్స్-షో రూమ్ ధర రూ.5.96 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Maruti S-Presso Price, Features
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు ధర రూ. 5.91 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో మంచి స్థలం ఉంది కానీ కేవలం 4 మంది మాత్రమే సరిగ్గా కూర్చోగలరు. కారులో 1.0L పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు CNGలో కూడా అందుబాటులో ఉంది. ఇది 32.73km/kg మైలేజీని ఇస్తుంది. దీని సీటింగ్ పొజిషన్ మీకు SUVలా అనిపిస్తుంది. ఈ కారులో ఈబీడీ ఫీచర్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

మీరు ఎంట్రీ లెవల్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఆల్టో, ఎస్-ప్రెస్సో రెండూ మీ రోజువారీ అవసరాలకు సరైన గొప్ప కార్లు. ఈ రెండు కార్ల నిర్వహణ కూడా చాలా తక్కువ. శక్తివంతమైన ఇంజన్లను కలిగి ఉన్నప్పటికీ, ఈ కార్ల మైలేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ అంత సౌకర్యంగా ఉండవు.

Show Full Article
Print Article
Next Story
More Stories