Maruti Suzuki Dzire CNG Mileage: కొత్త డిజైర్ మైలేజ్ మాములుగా లేదుగా.. కేజీపై 33.73 కిమీ దూసుకుపోతుంది

Maruti Suzuki Dzire CNG Mileage
x

Maruti Suzuki Dzire CNG Mileage: కొత్త డిజైర్ మైలేజ్ మాములుగా లేదుగా.. కేజీపై 33.73 కిమీ దూసుకుపోతుంది

Highlights

Maruti Suzuki Dzire CNG Mileage: మారుతి సుజుకి తన నాల్గవ తరం డిజైర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు నవంబర్ 11న మార్కెట్లోకి రానుంది.

Maruti Suzuki Dzire CNG Mileage: మారుతి సుజుకి తన నాల్గవ తరం డిజైర్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు నవంబర్ 11న మార్కెట్లోకి రానుంది. మారుతి ఫేమస్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ పెట్రోల్, పెట్రోల్-CNG పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకారం డిజైర్ CNG 33.73 km/kg అందిస్తుంది.

ఓ నివేదిక ప్రకారం, కొత్త సిఎన్‌జి డిజైర్ కిలోకు 33.73 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ మైలేజ్ మూడవ తరం డిజైర్ CNG కంటే ఎక్కువ. పాత డిజైర్ కిలోకు 31.12 కి.మీ మైలేజీని ఇస్తుంది. కొత్త కారు Z-సిరీస్ 1.2-లీటర్ మూడు-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది.

కంపెనీ ఈ ఇంజన్‌ని స్విఫ్ట్ సిఎన్‌జిలో ఇన్‌స్టాల్ చేసింది. అయితే కాంపాక్ట్ సెడాన్ మైలేజ్ స్విఫ్ట్ CNG కంటే మెరుగ్గా ఉంది. స్విఫ్ట్ CNG మైలేజ్ 32.85 kg/kg. కొత్త డిజైర్ మారుతి నాల్గవ అత్యధిక మైలేజ్ CNG కారు. ఈ జాబితాలో సెలెరియో CNG (34.43 km/kg), వ్యాగన్ R (34.05 km/kg), Alto K10 (33.85 km/kg) వంటి హ్యాచ్‌బ్యాక్‌ల పేర్లు ఉన్నాయి.

ఇతర మారుతి మోడళ్ల మాదిరిగానే డిజైర్ CNG మిడ్-స్పెక్ VXi, ZXi ట్రిమ్‌లలో మార్కెట్‌లోకి వస్తుంది. రెండింటిలో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. డిజైర్ CNG ఆటోమేటిక్ అవకాశం లేదు. సిఎన్‌జితో నడిచే డిజైర్ మార్కెట్లో టిగోర్ సిఎన్‌జి, ఆరా సిఎన్‌జి వంటి వాహనాలతో పోటీపడుతుంది. డిజైర్ సిఎన్‌జి ధర దాని పెట్రోల్ వేరియంట్ కంటే రూ.50,000 నుండి 85,000 వరకు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories