Maruti Suzuki: చరిత్ర సృష్టించిన మారుతీ సుజుకి.. భారత్‌లో ఏకంగా 3 కోట్ల కార్లతో సరికొత్త రికార్డ్..!

Maruti Suzuki Crosses 3 Crore Units Production Milestone In India
x

Maruti Suzuki: చరిత్ర సృష్టించిన మారుతీ సుజుకి.. భారత్‌లో ఏకంగా 3 కోట్ల కార్లతో సరికొత్త రికార్డ్..

Highlights

Maruti Suzuki: భారతదేశంలోని అతిపెద్ద ఆటోమేకర్లలో ఒకటైన మారుతీ సుజుకీ

Maruti Suzuki: భారతదేశంలోని అతిపెద్ద ఆటోమేకర్లలో ఒకటైన మారుతీ సుజుకీ దేశంలో 3 కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. మారుతి 1983లో భారతదేశంలో తన కార్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఈ బ్రాండ్ ఈ మైలురాయిని చేరుకోవడానికి 40 సంవత్సరాల నాలుగు నెలల సమయం పట్టింది. ప్రస్తుతం భారతదేశంలో మారుతీకి చెందిన 18 కార్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటిలో 9 కార్లు అరేనా డీలర్‌షిప్ ద్వారా, 8 కార్లు నెక్సా డీలర్‌షిప్ ద్వారా విక్రయించబడుతున్నాయి.

హర్యానాలోని ప్లాంట్‌లో 2.68 కోట్లకు పైగా వాహనాలు తయారు చేయగా, MSIL అనుబంధ సంస్థ సుజుకి మోటార్ గుజరాత్‌లో 32 లక్షలకు పైగా వాహనాలు తయారు చేశాయి. Alto, Swift, Wagon R, M800, Dezire, Omni, Baleno, Eeco, Brezza, Ertigaలతో సహా 10 మోడల్‌లు ఈ రికార్డును సాధించడంలో సహకరించాయి.

ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ, 'మేం 1983లో తయారీని ప్రారంభించినప్పటి నుంచి సంవత్సరానికి మా ఉత్పత్తులపై తమ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తున్న మా వినియోగదారులందరికీ ధన్యవాదాలు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా దేశీయ, ప్రపంచ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి మేం దేశంలో మా కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తున్నాం. అలాగే, భారతదేశం నుంచి మొత్తం వాహనాల ఎగుమతుల్లో మారుతికి 40 శాతం వాటా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories