Upcoming Cars: జోరు పెంచుతున్న కంపెనీలు.. మార్కెట్‌లోకి రానున్న సరికొత్త కార్లు..!

Upcoming Cars
x

Upcoming Cars

Highlights

Upcoming Cars: మారుతి, మహీంద్రా, టాటా కంపెనీలు పండుగ సీజన్‌లో సరికొత్త కార్లను లాంచ్ చేయనున్నాయి.

Upcoming Cars: పండుగల సీజన్ ప్రారంభం కానుంది. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో మీ ఇంటికి కొత్త కారుని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు వచ్చే పండుగ సీజన్‌లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రాబోయే మోడల్‌లో కంపెనీ ఫేమస్ కార్ల అప్‌డేట్ వెర్షన్‌లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలలో ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుండి మహీంద్రా, దేశంలోని అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకి నుండి నిస్సాన్ వరకు ఉన్నాయి. రాబోయే పండుగ సీజన్‌లో లాంచ్ కానున్న అటువంటి 5 కాంపాక్ట్ కార్ల ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ధర, వివరంగా తెలుసుకుందాం.

New Maruti Suzuki Dzire
భారతీయ కస్టమర్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ మారుతి డిజైర్ ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మారుతి సుజుకి డిజైర్ ఫేస్‌లిఫ్ట్ రాబోయే నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అప్‌డేటెట్ డిజైర్‌లో 1.2 లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ పవర్‌ట్రెయిన్‌గా ఉపయోగించనున్నారు.

New Honda Amaze
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన పాపులర్ సెడాన్ అమేజ్‌లో అప్ డేటెడ్ వెర్షన్‌ను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి డిజైర్‌తో పోటీపడే హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది.

Tata Nexon CNG
టాటా నెక్సాన్ భారతీయ కస్టమర్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఇప్పుడు కంపెనీ సిఎన్‌జి వేరియంట్‌లో టాటా నెక్సాన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా నెక్సాన్ సిఎన్‌జి సెప్టెంబర్ 2024లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర గురించి మాట్లాడినట్లయితే పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే టాటా నెక్సాన్ CNG కోసం వినియోగదారులు రూ. 80,000 నుండి రూ. 90,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Mahindra XUV 3XO EV
ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన పాపులర్ SUV XUV 3X0 ఎలక్ట్రిక్ వేరియంట్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మహీంద్రా XUV 3X0 EV భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. మహీంద్రా XUV 3X0 EV వినియోగదారులకు ఒకే ఛార్జ్‌పై దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ అందజేస్తుందని అనేక నివేదికలు పేర్కొన్నాయి. మహీంద్రా XUV 3X0 మార్కెట్లో టాటా పంచ్ EVతో పోటీపడుతుంది.

Nissan Magnite Facelift
జపనీస్ దిగ్గజ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ప్రసిద్ధ SUV మాగ్నైట్‌ను చాలా నెలలుగా భారతీయ రోడ్లపై టెస్ట్ చేస్తోంది. కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌ను అక్టోబర్ 4, 2024న లాంచ్ చేయబోతోంది. అయితే లాంచ్‌కు ముందు మరోసారి నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ సమయంలో కనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories