Mahindra XEV 7e: మార్కెట్లో లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్.యూ.వీ లుక్స్ మామూలుగా లేవు.. ఇక ఫీచర్స్ అయితే...

Mahindra XEV 7e
x

మహీంద్రా కొత్త XEV 7e ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఫోటోలు, ఫీచర్లు లీక్.. మార్కెట్లో తిరుగులేదంతే..!

Highlights

Mahindra XEV 7e: మహీంద్రా ఇప్పుడు దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్‌లో భారీగా పెట్టుబడులను పెడుతోంది.

Mahindra XEV 7e: మహీంద్రా ఇప్పుడు దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్‌లో భారీగా పెట్టుబడులను పెడుతోంది. ఇంతకుముందు కంపెనీ ఈ విభాగంలో XUV400 ఎలక్ట్రిక్ ఎస్ యూవీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు BE 6e, XEV 9e లను కూడా తీసుకురాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీలు వాటి పవర్ ఫుల్ ఫీచర్ల కారణంగా ఈ కార్ల శ్రేణి ముఖ్యాంశాల్లో నిలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా, దాని ధరల విభాగంలో అనేక లగ్జరీ, ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్ యూవీలకు గట్టి పోటీని ఇస్తోంది. అదే క్రమంలో ఇప్పుడు కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎస్ యూవీ XUV700 ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీనికి XEV 7e అని పేరు పెట్టారు.

మహీంద్రా భారతదేశంలో XEV 7e పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ లీకైన ఫోటోలు XEV 7e ఇటీవల ప్రారంభించబడిన XEV 9e నాన్-కూపే వెర్షన్ అని, దాదాపు అన్ని ఒకే విధమైన ఫీచర్లు, పరికరాలతో ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ ఎస్ యూవీలో ఉన్న పెద్ద తేడా ఏమిటంటే XEV 7e మూడు వరుసల సీటింగులను కలిగి ఉంటుంది. ఇది XEV 9eలో ఇది లేదు. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్ యూవీలోల కోసం కంపెనీ XEV, BEలను కొత్త సబ్-బ్రాండ్‌లుగా ఎంపిక చేసింది. ఇప్పుడు, XEV సబ్ బ్రాండ్ XEV 7e అనే కొత్త శ్రేణిని లాంచ్ చేయబోతుంది.

కంపెనీ XEV 9e అలాగే XEV 7e పేరు కోసం ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసింది. రెండు ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు ఒకే రోజున దాఖలు చేయబడ్డాయి. XEV 9e, BE 6eలతో పాటుగా మహీంద్రా XEV 7eని విడుదల చేస్తుందని ఊహించారు, అది జరగలేదు. లీకైన ఫోటోలో, XEV 7e ఖరారు చేయబడిందని.. ఉత్పత్తికి సిద్ధంగా ఉందని చూడవచ్చు. ఇది XEV 9e, BE 6eతో టెస్టింగ్ నిర్వహించింది కంపెనీ. కానీ మహీంద్రా XEV 7e లాంచ్ న్యూ ఇయర్ కోసం సేవ్ చేయబడినట్లు తెలుస్తోంది.

మహీంద్రా XEV 7e ఫీచర్లు

XEV 7e అనేది ప్రాథమికంగా భారతదేశంలో విక్రయించబడుతున్న XUV700 ICE మిడ్-సైజ్ ఎస్ యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్. డిజైన్ గురించి చెప్పాలంటే.. ఇది XEV 9e నుండి ఫ్రంట్ ఫేసియా, డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో రాబోతుంది. అయితే సైడ్ ప్రొఫైల్, వెనుక భాగం XUV700 నుండి తీసుకోబడింది. XEV 7e కొత్త వీల్ డిజైన్‌లను కలిగి ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన ఏకైక మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ SUV. మూడు వరుసల సీటింగ్ కాకుండా, XEV 7e లోపలి భాగంలో XEV 9eని పోలి ఉంటుంది. XEV 7e రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, ఇల్యూమినేటెడ్ లోగోతో కొత్త స్టీరింగ్ వీల్, 1400W 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, VisionX HUD, పవర్డ్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్, లెవల్-2+ ADAS సూట్, ఇతర ఫీచర్లతో అద్భుతంగా తీర్చిదిద్దింది కంపెనీ.

పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుతూ.. XEV 7e లీకైన ఫోటో డ్యూయల్-మోటార్ లేఅవుట్, ఆఫ్-రోడింగ్ కోసం 'స్నో' లాంటి ట్రాక్షన్ మోడ్‌లను చూపుతుంది. XEV 9e, BE 6e లలో డ్యూయల్ మోటార్లు లేవని గమనించాలి. దీని కంబైన్డ్ పెర్ఫార్మెన్స్ అవుట్‌పుట్ 350 bhp పవర్, 450 Nm కంటే ఎక్కువ టార్క్ ఉంటుంది. దీని యాక్సిలరేషన్ గణాంకాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories