Mahindra: ఎలాంటి రోడ్డైనా పర్లేదు.. స్టార్ట్ చేస్తే దూసుకెళ్లడమే.. బుకింగ్స్ మొదలెట్టిన మహీంద్రా.. ధరెంతో తెలుసా?

mahindra thar roxx 4x4 bookings starts from october 3rd check prices and features
x

Mahindra: ఎలాంటి రోడ్డైనా పర్లేదు.. స్టార్ట్ చేస్తే దూసుకెళ్లడమే.. బుకింగ్స్ మొదలెట్టిన మహీంద్రా.. ధరెంతో తెలుసా?

Highlights

ఇది CrawlSmart వంటి కొత్త, వినూత్న ఫీచర్లను కూడా కలిగి ఉంది.

Mahindra Thar Roxx 4x4: మహీంద్రా తన కొత్త థార్ రాక్స్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15న రూ. 12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ క్రమంలో థార్ బుకింగ్‌లు అక్టోబర్ 3 నుంచి అంటే నవరాత్రుల నుంచి మొదలవుతాయని పేర్కొంది. కాగా, ఇది డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌లో లభించే ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..

ఫీచర్లు, డిజైన్..

ఇది CrawlSmart వంటి కొత్త, వినూత్న ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇది పెడల్‌లను ఉపయోగించకుండా తక్కువ వేగంతో డ్రైవింగ్ చేయడంలో సహాయపడుతుంది. అదనంగా, IntelliTurn ఉంది. ఇది ఒక వెనుక చక్రాన్ని లాక్ చేయడం ద్వారా సులభంగా ప్రమాదకరైన మలుపులు తీసుకోవడంలో సహాయపడుతుంది. అదనంగా, థార్ రాక్స్ 650 మిమీ వాటర్ వాడింగ్ కెపాసిటీ అంటే మంచు, ఇసుక, బురదతో సహా బహుళ టెర్రైన్ మోడ్‌లతో వస్తుంది. ఇది అన్ని రకాల రోడ్లపైనా దూసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట.

ఇందులో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. అలాగే, ఈ SUVలో 10.25-అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, అడ్రినాక్స్ కనెక్ట్ రివర్స్ కెమెరా విత్ బిల్ట్-ఇన్-అలెక్సా, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసిన ORVM ఫీచర్లు ఉన్నాయి. ఫుట్‌వెల్ లైటింగ్, లెవెల్-2 ఎయిడ్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు వంటివి అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్, పనితీరు..

థార్ రాక్స్ 4x4లో 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ కలదు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో, ఈ ఇంజన్ 150bhp పవర్, 330Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆటోమేటిక్ వేరియంట్ 173bhp పవర్, 370Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి. థార్ రాక్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇది 4ఎక్స్‌ప్లోర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది అన్ని రకాల కష్టతరమైన భూభాగాలపై డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది.

వేరియంట్లు, ధరలు..

MX5, AX5L, AX7L వంటి మూడు వేరియంట్‌లలో రాక్స్ 4x4 రానుంది. వేరియంట్‌ల వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

MX5 4x4 MT – రూ 18.79 లక్షలు

AX5L 4x4 AT - రూ. 20.99 లక్షలు

AX7L 4x4 MT - రూ 20.99 లక్షలు

AX7L 4x4 AT - రూ. 22.49 లక్షలు

Show Full Article
Print Article
Next Story
More Stories