Mahindra Scorpio: బ్రాండ్ ‌కా బాప్.. కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా స్కార్పియో

Mahindra Scorpio: బ్రాండ్ ‌కా బాప్.. కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా స్కార్పియో
x
Highlights

Mahindra Scorpio: మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో కారును లాంచ్ చేసి 22 సంవత్సరాలు కావొస్తోంది. మహీంద్రా బ్రాండ్‌ వ్యాల్యూను పెంచడంలో స్కార్పియో...

Mahindra Scorpio: మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో కారును లాంచ్ చేసి 22 సంవత్సరాలు కావొస్తోంది. మహీంద్రా బ్రాండ్‌ వ్యాల్యూను పెంచడంలో స్కార్పియో ఎప్పుడూ ముందే ఉంది. కంపెనీ మహీంద్రా స్కార్పియోను ఎన్, క్లాసిక్ మోడళ్లలో విక్రయిస్తోంది. గత సంవత్సరం అంటే 2024లో కూడా మహీంద్రా స్కార్పియో మొత్తం 1,66,364 యూనిట్ల SUVలను విక్రయించింది. ఈ విక్రయాల ఆధారంగా, స్కార్పియో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న తొమ్మిదవ కారుతో పాటు కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఇంకా, ఇది 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారుగానూ సేల్స్ రికార్డుకెక్కింది. రండి దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ, ఆక్స్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED DRLతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఇది కాకుండా భద్రతా ఫీచర్లుగా కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్, ABS, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు కూడా అందించారు. మార్కెట్లో, స్కార్పియో క్లాసిక్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్ వంటి SUVలతో పోటీపడుతోంది.

పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే స్కార్పియో క్లాసిక్‌లో 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 132Bhp పవర్, 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ప్రస్తుతం భారతీయ వినియోగదారుల కోసం 5 రంగులలో అందుబాటులో ఉంది. కస్టమర్లు దీనిని 2 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.62 లక్షల నుండి రూ. 17.42 లక్షల వరకు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories