Mahindra: సొంత రికార్డునే బ్రేక్ చేసిన మహీంద్రా.. ఏకంగా 41,267 కార్ల సేల్స్‌తో అగ్రస్థానం..!

Mahindra Recorded Monthly Car sales of 41,267 Units in the Domestic Market in September 2023
x

Mahindra: సొంత రికార్డునే బ్రేక్ చేసిన మహీంద్రా.. ఏకంగా 41,267 కార్ల సేల్స్‌తో అగ్రస్థానం..!

Highlights

Mahindra: సెప్టెంబర్ 2023 నెలలో మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (M&M Limited) మొత్తం అమ్మకాలు 75,604 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఎగుమతులతో సహా 17% వార్షిక వృద్ధిగా నమోదైంది.

Mahindra: సెప్టెంబర్ 2023 నెలలో మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (M&M Limited) మొత్తం అమ్మకాలు 75,604 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఎగుమతులతో సహా 17% వార్షిక వృద్ధిగా నమోదైంది. ప్యాసింజర్ వాహనాల విభాగంలో, M&M (మహీంద్రా & మహీంద్రా) ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్లో 41,267 యూనిట్ల (కార్లు) నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. మహీంద్రా ఒకే నెలలో ఇన్ని SUVలను విక్రయించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ నెలలో, వార్షిక ప్రాతిపదికన కంపెనీ ప్యాసింజర్ వాహనాల లైనప్‌లో మొత్తం 20% వృద్ధి నమోదైంది.

మహీంద్రా నెలవారీ మొత్తం 42,260 వాహనాల విక్రయాలను నమోదు చేసింది. ఇందులో విదేశీ మార్కెట్‌లకు రవాణా చేయబడిన ప్రయాణీకుల వాహనాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, వాణిజ్య వాహనాల దేశీయ విక్రయాలు సెప్టెంబర్‌లో 23,997 యూనిట్లుగా ఉన్నాయి. M&M లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ, “వరుసగా మూడవ నెలలో అత్యధిక SUV అమ్మకాలను సాధించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. ఈ నెలలో 41,267 కార్లతో 20% పెరుగుదల కనిపించింది. మేం మొత్తం 17% వృద్ధిని కూడా నమోదు చేశాం.

విజయ్ నక్రా ప్రకటన..

"సెప్టెంబర్‌లో, మేం మా బొలెరో మ్యాక్స్ పికప్ ట్రక్ 1 లక్ష యూనిట్ల మార్కును కూడా అధిగమించాం. ఈ సంఖ్యను చేరుకున్న దేశంలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న లిస్ట్‌లో బొలెరో మ్యాక్స్ పికప్ ట్రక్ నిలిచింది. మా కీలకమైన SUV బ్రాండ్‌ల నుంచి డిమాండ్ బలంగా ఉన్నందున, మేం సెమీకండక్టర్ల లభ్యతను నిశితంగా పరిశీలిస్తున్నాం. పండుగ సీజన్ బలమైన డిమాండ్‌ను తీర్చడానికి ఎంచుకునే భాగాలను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం" అంటూ తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories