Mahindra XUV 3XO: మహీంద్రా XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Mahindra XUV 3XO
x

Mahindra XUV 3XO

Highlights

Mahindra XUV 3XO: గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ ఆటో మార్కెట్‌లో ఎస్‌యూవీ డిమాండ్ వాహనలకు డిమాండ్ పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది.

Mahindra XUV 3XO: గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ ఆటో మార్కెట్‌లో ఎస్‌యూవీ డిమాండ్ వాహనలకు డిమాండ్ పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే ప్రముఖ దేశీయ కార్ల కంపెనీ మహీంద్రా కొన్ని నెలల క్రితం తన ఫెమస్ ఎస్‌యూవీ XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీనికి అద్భుతమైన డిమాండ్ వస్తోంది. అప్‌గ్రేడ్ XUV 300 కొత్త పేరు మహీంద్రా XUV 3XO గా కంపెనీ మార్పు చేసింది. మహీంద్రా XUV 3X0 గురించి వివరంగా తెలుసుకుందాం.

మహీంద్రా XUV 3XO భారతీయ మార్కెట్లో మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. మహీంద్రా XUV 3X0లో కస్టమర్‌లు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌ల ఎంపికను పొందుతారు. మహీంద్రా XUV 3X0 పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 7.79 లక్షల నుండి రూ. 15.48 లక్షల వరకు ఉంది. అయితే డీజిల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 9.98 లక్షల నుండి రూ. 14.99 లక్షల వరకు ఉంటుంది.

మహీంద్రా XUV 3X0 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా కారు లోపలి భాగంలో అనేక ఆధునిక ఫీచర్లు కూడా అందించారు.

భద్రత గురించి మాట్లాడినట్లయితే మహీంద్రా XUV 3X0 లో కస్టమర్‌లు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లను పొందుతారు. ఇది కాకుండా కారులో లెవల్ 2 ADAS టెక్నాలజీ, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ రాడార్ సెన్సార్ కూడా ఉన్నాయి.స

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ TGDi పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది కాకుండా కారులో 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్‌లు కారులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటి ఎంపికను పొందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories