Mahindra: షాకిచ్చిన మరో ఆటోమొబైల్ కంపెనీ.. త్వరలో భారీగా పెరగనున్న స్కార్పియో-థార్‌ ధరలు

Mahindra
x

Mahindra: షాకిచ్చిన మరో ఆటోమొబైల్ కంపెనీ.. త్వరలో భారీగా పెరగనున్న స్కార్పియో-థార్‌ ధరలు

Highlights

Mahindra: మహీంద్రా కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే త్వరగా కొనేయండం. కంపెనీ త్వరలో తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతోంది.

Mahindra: మహీంద్రా కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే త్వరగా కొనేయండం. కంపెనీ త్వరలో తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇవ్వబోతోంది. కంపెనీ త్వరలో తన కార్ల ధరలను పెంచే అవకాశం ఉంది. మహీంద్రా కంపెనీ తయారు చేస్తున్న కార్ల ధరలను దాదాపు 3 శాతం పెంచుకోవచ్చని తెలుస్తోంది. మహీంద్రా ప్రకారం.. ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల జరుగుతోంది. కొత్త సంవత్సరం అంటే జనవరి 2025 నుండి, హ్యుందాయ్, ఆడి, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి అనేక కార్ల తయారీ కంపెనీలు ధరలను పెంచాలని నిర్ణయించాయి, ఆ తర్వాత ఇప్పుడు మహీంద్రా తన అన్ని మోడల్ శ్రేణుల ధరలను ఈ సందర్భంగా మూడు శాతం వరకు పెంచనున్నట్లు తెలుస్తుంది.

ధరల పెరుగుదల వెనుక కారణం ఏమిటి?

ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణమేనని కంపెనీ పేర్కొంది. రాబోయే నెలల్లో XEV 7e, BE.07, BE.09, XUV 400లను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా, కంపెనీ ఈవీ శ్రేణిని కూడా పెంచాలని భావిస్తుంది. మహీంద్రా కంపెనీ కార్లపై ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. గత నెల అంటే నవంబర్ 2024 సేల్స్ రిపోర్ట్ గురించి మాట్లాడినట్లయితే, ఈ నెలలో కంపెనీ స్కార్పియో సిరీస్, థార్ సిరీస్, XUV 3XO, XUV 700 అమ్మకాలలో వార్షిక పెరుగుదల భారీగా కనిపించింది. కంపెనీ కార్లు బాగా అమ్ముడవుతున్నాయి. వీటిలో నాలుగు మోడళ్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇది కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూవీ

మహీంద్రా & మహీంద్రా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూవీ స్కార్పియో సిరీస్‌లో N, క్లాసిక్ ఉన్నాయి. గత నెలలో ఈ కార్లలో 12 వేల 704 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది వార్షికంగా 4 శాతం పెరిగింది. ఇది కాకుండా మహీంద్రా XUV700, మహీంద్రా థార్-థార్ రాక్స్, మహీంద్రా XUV3XO కూడా బాగా అమ్ముడయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories