Cheapest Electric Bike: బుజ్జి వచ్చేసింది.. ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 10 పైసల ఖర్చుతో 110 కిమీ మైలేజ్..!

Cheapest Electric Bike
x

Cheapest Electric Bike

Highlights

Cheapest Electric Bike: Cheapest Electric Bike: కైనెటిక్ ఎలక్ట్రిక్ లూనాను లాంచ్ చేసింది. కిలోమీటరుకు 10 పైసలు ఖర్చుతో 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Cheapest Electric Bike: దేశంలో ఇందన ధరలు ప్రతిరోజూ పెరుగుతున్నాయి. దీంతో అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్స్ వాడితే పర్యావరణాన్ని రక్షించడంతో పాటు మన జేబులకు చిల్లు పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు తారాస్థాయికి చేరింది. ప్రతి ఏడాది అమ్మకాల విషయంలో ఎలక్ట్రిక్ వాహనాలు సేల్స్‌లో తన మార్క్‌ను చూపిస్తున్నాయి.

ఇందులో భాగంగానే కైనెటిక్ రోజువారీ అవసరాలకు, చిన్న వ్యాపారం కోసం ఉపయోగించగల ఎలక్ట్రిక్ లూనాను విడుదల చేసింది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే ఇంతకుముందు కైనెటిక్ ఎలక్ట్రిక్ లూనా పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రారంభించినప్పటి నుండి దీనికి మరింత డిమాండ్ పెరిగింది. మనకు ఇ-లూనా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కొత్త ఎలక్ట్రిక్ లూనా ధర రూ.69,990 నుంచి ప్రారంభమవుతుంది. లూనా రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు కేవలం 10 పైసలు మాత్రమే. పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌లతో పోలిస్తే మీరు ప్రతి నెలా రూ. 2,260 ఆదా చేసుకోవచ్చు. కంపెనీ దాని గణనను లెక్కించి, తన వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. ఇ-లూనాను ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 యూనిట్లు పడుతుంది. ఎలక్ట్రిక్ లూనా రోజువారీ ఉపయోగం కోసం డిజైన్ చేశారు. ఇది కాకుండా ఇది చిన్న వ్యాపారాలకు చాలా ఉపయోగకరమైన వాహనంగా నిరూపించబడుతుంది.

ఎలక్ట్రిక్ లూనా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఇందులో 1.7kWh, 2kWh బ్యాటరీలు ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ లూనాలో సేఫ్టీ లాక్ అందుబాటులో ఉంది.

మెరుగైన బ్రేకింగ్ కోసం ఇది కాంబి బ్రేక్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనికి 16 అంగుళాల పెద్ద వీల్స్ ఉన్నాయి. మెరుగైన రైడ్ కోసం ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ లూనాలో లగేజీ నిల్వ చేయడానికి ముందు భాగంలో మంచి స్థలం ఉంది. మీరు దానిపై 150 కిలోల వరకు వస్తువులను లోడ్ చేయవచ్చు. ఇందులో స్టీల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories