Kia New Cars: కియా దూకుడు.. మూడు కొత్త కార్లు లాంచ్.. హిట్ అవ్వడం పక్కా..!

Kia New Cars
x

 Kia New Cars

Highlights

Kia New Cars: కియా మూడు కొత్త కార్లను లాంచ్ చేయనుంది. ఇంవులో ఎలక్ట్రిక్, ఎమ్‌విపి వేరియంట్లు ఉన్నాయి.

Kia New Cars: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన భారీ విజయాన్ని సాధించింది. కంపెనీ నుండి వస్తున్న కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కంపెనీకి చెందిన కియా సోనెట్, కియా సెల్టోస్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇటీవలే కియా సోనెట్ భారతీయ మార్కెట్లో 4.50 లక్షల యూనిట్ల SUV అమ్మకాల సంఖ్యను అధిగమించింది. ఇప్పుడు మార్కెట్‌లో తన కార్లను ఉన్న డిమాండ్ అనుగుణంగా అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రాబోయే మూడు మోడళ్ల ధరలు, ఫీచర్లు తదితర వివరాల గురించి తెలుసుకుందాం

Kia Cyros
కియా వచ్చే ఏడాది భారతదేశంలో సరికొత్త స్కిరోస్‌ను ప్రారంభించనుంది. దీని డిజైన్ గురించి మాట్లాడినట్లయితే.. ఇది వర్టికల్ LED లైటింగ్‌ను కలిగి ఉంటుంది, ఇది టర్న్ సిగ్నల్, క్లామ్‌షెల్ బోనెట్‌గా కూడా పని చేస్తుంది. వెనుకవైపు పిల్లర్ మౌంటెడ్ Lసైజ్ LED టెయిల్ ల్యాంప్‌లు, అదనపు లైటింగ్‌తో కూడిన బంపర్ ఉంటాయి. కియా స్కిరోస్ 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణించనుంది. నివేదికల ప్రకారం రాబోయే కియా కారు ఎలక్ట్రిక్ వేరియంట్‌లు, హైబ్రిడ్ వేరియంట్‌లను కలిగి ఉన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది.

Kia Carens Facelift
కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్‌ స్పై షాట్‌లు కొత్త స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, రీడిజైన్ చేయబడిన బంపర్, LED లైట్ బార్‌ను పొందుతున్న అప్‌డేట్ చేయబడిన MPV ఫ్రంట్ ఫాసియాను వెల్లడించాయి. సింగిల్ పేన్ సన్‌రూఫ్, రూఫ్ రెయిల్‌లు, కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. అదే సమయంలో బ్లైండ్ స్పాట్ కెమెరాతో లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు కారు లోపలి భాగంలో చూడవచ్చు. అయితే కారు పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం లేదు.

Kia Electric RV
కియా 2025లో భారతదేశంలో ఎలక్ట్రిక్ MPV (RV)ని ప్రారంభించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కంపెనీ సుమారు రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. రాబోయే Kia RV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిమీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందించగలదని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories