Kia Sonet Facelift: కియా సోనెట్.. సరికొత్త ఫీచర్లతో వచ్చేస్తుంది

Kia Sonet Facelift
x

Kia Sonet Facelift: కియా సోనెట్.. సరికొత్త ఫీచర్లతో వచ్చేస్తుంది

Highlights

Kia Sonet Facelift: కియా ఇండియా (Kia India) దేశీయ విపణిలో సోనెట్‌ను సరసమైన SUVగా విక్రయిస్తోంది. తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజీ కారణంగా, కియా సోనెట్ (Kia Sonet) పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.

Kia Sonet Facelift: కియా ఇండియా (Kia India) దేశీయ విపణిలో సోనెట్‌ను సరసమైన SUVగా విక్రయిస్తోంది. తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజీ కారణంగా, కియా సోనెట్ (Kia Sonet) పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. 2 లక్షల మందికి పైగా కస్టమర్లు ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) ని తమ ఇళ్లకు తీసుకెళ్లినట్లు కంపెనీ ప్రకటించింది. సోనెట్‌లోని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

నిరంతర విక్రయాల కారణంగా, కొత్త Kia Sonet జనవరి 2024లో ప్రారంభించిన కేవలం 11 నెలల్లోనే 1 లక్ష అమ్మకాలను దాటింది. 76శాతం మంది కొనుగోలుదారులు పెట్రోల్ ఇంజిన్‌తో కియా సోనెట్‌ను ఇష్టపడతారు, అయితే 24 శాతం మంది వినియోగదారులు డీజిల్ ఇంజిన్‌తో కొనుగోలు చేయడానికి, 89 శాతం మంది సన్‌రూఫ్‌తో కొనుగోలు చేశారు.

రూ. 7.99 లక్షల నుండి రూ. 15.77 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో వస్తున్న కొత్త సోనెట్ దేశంలోని అత్యుత్తమ సబ్-4-మీటర్ SUV జాబితాలో ఉంటుంది. గణాంకాల గురించి మాట్లాడైట్ కియా ప్రతి నెలా 10 వేల యూనిట్లను విక్రయిస్తుంది. ఇది మొత్తం 3 ఇంజన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని క్లెయిమ్ మైలేజ్ 18-24 KM/PH వరకు ఉంటుంది.

అప్డేట్ చేసిన సోనెట్ కాస్మొటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభిచారు. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్‌తో కీలెస్ ఎంట్రీ, వెనుక డోర్ సన్‌షేడ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త సోనెట్ చాలా సురక్షితంగా తయారు చేశారు. ఇది టాప్-స్పెక్ ట్రిమ్‌లలో లెవెల్-1 ADAS 10 భద్రతా ఫీచర్లు ఇచ్చారు. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC విత్ EBD, VSM, TPMS, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), వెనుక పార్కింగ్ సెన్సార్ మరియు ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్ వంటి 15 ప్రామాణిక భద్రతా ఫీచర్లతో కూడా వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories