Upcoming Hybrid Cars: మార్కెట్‌లోకి రానున్న హైబ్రిడ్ కార్లు.. ఇవి కొంటే బెటర్..!

Upcoming Hybrid Cars
x

Upcoming Hybrid Cars

Highlights

Upcoming Hybrid Cars: కియా, మారుతి సుజికి కొత్త హైబ్రిడ్ కార్లను త్వరలో లాంచ్ చేయన్నాయి. ఇవి ఎక్కువ మైలేజ్ అందిస్తాయి.

Upcoming Hybrid Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఫుల్ జోష్ మీద ఉంది. కొత్త మోడళ్ల రాకతో కార్ లవర్స్ ఈవీల కొనుగోలుపై ఇంటరెస్ట్ చూపుతున్నారు. కానీ అనుకున్న స్థాయిలో ఈవీలు అందుబాటులోకి రాలేదు. అటువంటి పరిస్థితుల్లో హైబ్రిడ్ కార్లు ఉపయోగంగా ఉంటాయి. వీటితో ఫ్యూయల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు గొప్ప టెక్నాలజీని అనుభవించవచ్చు. అలానే ఇప్పుడు ప్రజలు తక్కువ ఎంట్రీ కార్ల నుంచి ప్రీమియం కార్ల వైపు మళ్లుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా హైబ్రిడ్ టెక్నాలజీ కార్లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ టెక్నాలజీ సాయంతో మైలేజీలోనూ, పనితీరులోనూ మంచి తేడా కనిపిస్తోంది. ఈ సమయంలో టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా హైడర్, మారుతి గ్రాండ్ విటారా, హోండా సిటీ హైబ్రిడ్ కార్ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త హైబ్రిడ్ కార్లు లాంచ్ కాబోతున్నాయి.

కియా క్లావిస్ హైబ్రిడ్
కియా మోటార్స్ ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో తన కాంపాక్ట్ SUV క్లావిస్‌ను విడుదల చేయబోతోంది. కొత్త మోడల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో రావచ్చు. ఇది సోనెట్, సెల్టోస్ మధ్య మోడల్ అవుతుంది. విశేషమేమిటంటే కొత్త క్లావిస్ కంపెనీ మొదటి హైబ్రిడ్ కారు. ఇది బాక్సీ డిజైన్‌లో వస్తుంది. అయితే ఇది చాలా మంచి స్పేస్ చూడవచ్చు. ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంటుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. ఇది కాకుండా, 360 డిగ్రీ కెమెరా సెటప్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు. కొత్త కియా క్లావిస్ ధర రూ. 10 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

మారుతి స్విఫ్ట్ డిజైర్‌ హైబ్రిడ్
స్విఫ్ట్ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మైల్డ్-హైబ్రిడ్, బలమైన హైబ్రిడ్ ఎంపికలను ఇందులో చూడవచ్చు. స్విఫ్ట్ ఈ సంవత్సరం టోక్యో మోటార్ షోలో హైబ్రిడ్ సెటప్‌తో పరిచయం చేసింది. ఇంజన్ గురించి మాట్లాడుతే స్విఫ్ట్‌లో కొత్త 1.2-లీటర్ Z12E ఇంజన్ ఉంటుంది. ఇది 80 bhp పవర్ 108 Nm టార్క్ ఇస్తుంది. దాని DC సింక్రోనస్ మోటార్ సహాయంత, ఈ ఇంజన్ 3bhp, 60 Nm ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు 24.5 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ప్రస్తుత స్విఫ్ట్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఇది కాకుండా కంపెనీ తన కొత్త డిజైర్‌ను కూడా విడుదల చేయనుంది. కొత్త మోడల్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. వెనుక కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories