Kawasaki Ninja: 296సీసీ ఇంజన్.. 6 గేర్లతో వచ్చిన కవాసకి నింజా-300 బైక్.. ధర వింటే దడ పుట్టాల్సిందే..!

Kawasaki Ninja 300 Bike Price And Features check Detail in telugu
x

Kawasaki Ninja: 296సీసీ ఇంజన్.. 6 గేర్లతో వచ్చిన కవాసకి నింజా-300 బైక్.. ధర వింటే దడ పుట్టాల్సిందే..

Highlights

Kawasaki Ninja 300 Bike: జపనీస్ బైక్ కంపెనీ కవాసకి భారత మార్కెట్లో '2024 కవాసకి నింజా 300'ని విడుదల చేసింది.

Kawasaki Ninja 300 Bike: జపనీస్ బైక్ కంపెనీ కవాసకి భారత మార్కెట్లో '2024 కవాసకి నింజా 300'ని విడుదల చేసింది. అప్‌డేట్ చేసిన నింజాను మూడు కలర్స్‌లో అందించింది. ఇందులో లైమ్ గ్రీన్, క్యాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ మూండస్ట్-గ్రే. ఇది కాకుండా ఈ బైక్ డిజైన్, ఫీచర్లలో పెద్దగా మార్పు లేదు.

2024 కవాసకి నింజా-300 ఇంజిన్, పవర్..

కొత్త కవాసకి నింజా-300 బైక్‌లో 296 cc DOHC, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ ప్యారలల్ ఫ్యూయల్-ఇంజెక్షన్ సిస్టమ్‌తో కూడిన 8-వాల్వ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 6 గేర్ బాక్స్‌ అందించారు. ఇది 11,000rpm వద్ద 38.8bhp శక్తిని, 10,000rpm వద్ద 26.1Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

KTM RC 390, Yamaha R3 లకు పోటీగా..

ఇది అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కూడిన గొట్టపు డైమండ్-రకం ఛాసిస్‌పై నిర్మించారు. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.43 లక్షలుగా ఉంది. ఇది అప్రిలియా RS 457, KTM RC 390, యమహా R3 లకు పోటీగా ఉంటుంది.

కవాసకి నింజా 300: ఫీచర్లు..

మెరుగైన పనితీరు కోసం, కంపెనీ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS, హీట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, రేస్-డెరైవ్డ్ క్లచ్, హై-టెన్సైల్ డైమండ్ ఛాసిస్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, డ్యూయల్ థ్రోటల్ వాల్వ్‌తో పాటు మరిన్ని ఫీచర్లను అందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories