Jawa 42 Bobber: బుల్లెట్ కంట్ పవర్‌ఫుల్.. అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న జావా 42 బాబర్.. ధర ఎంతో తెలుసా?

Jawa 42 Bobber May Launch Upgrade Version Check Price And Features
x

Jawa 42 Bobber: బుల్లెట్ కంట్ పవర్‌ఫుల్.. అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న జావా 42 బాబర్.. ధర ఎంతో తెలుసా?

Highlights

Jawa 42 Bobber Price And Features: జావా త్వరలో తన పాపులర్ బైక్ జావా 42 బాబర్ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త అవతార్ లాంచ్‌కు ముందు కంపెనీ తన అధికారిక టీజర్‌ను విడుదల చేసింది.

Jawa 42 Bobber Price And Features: జావా త్వరలో తన పాపులర్ బైక్ జావా 42 బాబర్ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త అవతార్ లాంచ్‌కు ముందు కంపెనీ తన అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో బైక్ వెనుక చక్రం చూపించారు. ఈ కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసే తేదీని కంపెనీ ప్రకటించలేదు. ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ పాపులర్ బైక్‌కి సంబంధించిన కొత్త వెర్షన్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు ఆటోమొబైల్‌లో వార్తలు వచ్చాయి.

దీపావళికి ముందే లాంచ్ అవుతుందా?

దేశంలో పండుగల సీజన్ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళికి ముందే పలు ఆఫర్లతో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

ఈ మోడల్‌లో ప్రత్యేకత ఏమిటి?

ఈ మోడల్‌ను సింగిల్ సీటుతో విడుదల చేసే అవకాశం ఉంది. దాని సైడ్ ప్యానెల్స్‌పై 'బాబర్ 42' అని రాసి ఉంది. ఈ వెర్షన్‌లో డ్యూయల్ ఎగ్జాస్ట్, సర్క్యులర్ హెడ్‌ల్యాంప్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్‌తో అందించనున్నారు.

బుల్లెట్ కంటే శక్తివంతం..

ప్రస్తుత మోడల్‌లో, కంపెనీ 334 cc కెపాసిటీ కలిగిన సింగిల్ సిలిండర్ ఇంజన్‌ని ఉపయోగించారు. ఇది 30.22 BHP పవర్, 32.64Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇంజన్ పవర్ అవుట్‌పుట్ పరంగా, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ 350 సీసీ ఇంజన్‌ల కంటే శక్తివంతమైనది. ఇది సుమారుగా 20Bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

3 రంగుల్లో లభ్యం..

ప్రస్తుతం, Jawa 42 Bobber ప్రస్తుత మోడల్ కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ 3 రంగులలో (మిస్టిక్ కాపర్, మూన్‌స్టోన్ వైట్, జాస్పర్ రెడ్ డ్యూయల్ టోన్) అందుబాటులో ఉంది. దీని మిస్టిక్ కాపర్ వేరియంట్ ధర రూ. 2,12,500, మూన్‌స్టోన్ వైట్ రూ. 2,13,500, జాస్పర్ రెడ్ రూ. 2,15,187 (ఎక్స్-షోరూమ్)లుగా ఉన్నాయి.

బాబర్ దాని ముందున్న మోడల్ పెరాక్ ఆధారంగా రూపొందించారు. కొత్త అవతార్‌లో ఆధునిక, స్పోర్టీ అనుభూతిని కలిగి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, కొత్తగా జోడించిన ఫీచర్లతో ధరలో కొంత పెరుగుదల ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories