iVoom S1 Lite: పూర్తి ఛార్జ్‌పై 75 కిమీల మైలేజీ.. Ola S1Xతో పోటీకి సిద్ధమైన ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ 'స్కూటర్..

IVoomi S1 Lite Electric Scooter launched Specifications and Features, price check here
x

iVoom S1 Lite: పూర్తి ఛార్జ్‌పై 75 కిమీల మైలేజీ.. Ola S1Xతో పోటీకి సిద్ధమైన ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ 'స్కూటర్..

IVoomi S1 Lite Electric Scooter launched Specifications and Features, price check here

Highlights

iVoom S1 Lite: పూర్తి ఛార్జ్‌పై 75 కిమీల మైలేజీ.. Ola S1Xతో పోటీకి సిద్ధమైన ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ 'స్కూటర్..

IVoomi S1 Lite Electric Scooter: ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ iVOOMi జూన్ 25న తన చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ S1 లైట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. పూణే ఆధారిత కంపెనీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. గ్రాఫేన్ అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో దీని బేస్ వేరియంట్ ధర రూ. 54,999లుగా పేర్కొంది.

అయితే, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.64,999లుగా పేర్కొంది. వీటిని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్‌లోని కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్ నుంచి కొనుగోలు చేయగలుగుతారు. కంపెనీ iVoomy S1 Lite ఇ-స్కూటర్ బేస్ వేరియంట్‌పై 18 నెలల వారంటీని, టాప్-స్పెక్ వేరియంట్‌పై 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.

రూ. 1,499 కంటే తక్కువ EMIతోనూ స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు..

iVoomy S1 Lite: డిజైన్, హార్డ్‌వేర్..

హార్డ్‌వేర్ గురించి మాట్లాడితే, ఎలక్ట్రిక్ స్కూటర్ ERW 1 గ్రేడ్ ఛాసిస్‌పై నిర్మించారు. స్కూటర్ 170ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, 18 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది. కంఫర్ట్ రైడింగ్ కోసం, టెలిస్కోపిక్ ఫోర్కులు అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ యూనిట్లలో ముందు, వెనుక వైపున అందించాయి.

బేస్ వేరియంట్ బరువు 101 కిలోలు, టాప్ స్పెక్ వేరియంట్ బరువు 82 కిలోలుగా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 6 రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. వీటిలో పెర్ల్ వైట్, మూన్ గ్రే, స్కార్లెట్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, ట్రూ రెడ్, పీకాక్ బ్లూ ఉన్నాయి. ఇతర ఫీచర్లలో 18-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్, LED ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

iVoomy S1 Lite: పనితీరు, రేంజ్, బ్యాటరీ..

ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లు 1.2 kW మోటార్‌తో అమర్చబడి ఉంటాయి. ఇది 1.8 kW గరిష్ట శక్తిని, 10.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ IP67 రేటింగ్‌ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. గ్రాఫేన్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఇ-స్కూటర్ బేస్ వేరియంట్ ఫుల్ ఛార్జ్‌పై 75 కి.మీ పరిధిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

అదే సమయంలో, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన టాప్-స్పెక్ వేరియంట్ ఫుల్ ఛార్జ్‌పై 85 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. iVoomi S1 Lite బేస్ వేరియంట్ ఛార్జ్ చేయడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అయితే, టాప్ స్పెక్ వేరియంట్ 4 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ అవుతుంది. బేస్ వేరియంట్ టాప్ స్పీడ్ 45kmph, టాప్ స్పెక్ వేరియంట్ టాప్ స్పీడ్ 55kmphలుగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories