Festive Offer: ధరలు భారీగా తగ్గాయి.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10 వేల డిస్కౌంట్..!

Festive offer
x

Festive offer

Highlights

Festive Offer: iVOOMi 78వ స్వాతంత్ర దినోత్సవం, రాఖీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద Jeet X ZE మోడల్‌పై రూ. 10,000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు

Festive Offer: ప్రముఖ ఈ-స్కూటర్ కంపెనీ iVOOMi 78వ స్వాతంత్ర దినోత్సవం, రాఖీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లు కంపెనీ లేటెస్ట్ Jeet X ZE మోడల్‌పై రూ. 10,000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఉచిత యాక్సెసరీలను దక్కొంచుకోవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 11 నుండి ఆగస్టు 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో "పెట్రోల్ సే ఆజాదీ"ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొనేందుకు కంపెనీ అవగాహన కల్పిస్తోంది. ఈ ఆఫర్ ఏదైనా సమీపంలోని iVOOMi డీలర్‌షిప్ వద్ద అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మీరట్, బికనీర్, నాగౌర్, మక్రానా, తిరువణ్ణామలై, తిరుచ్చి, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి నగరాల్లోని ఏదైనా iVOOMi డీలర్‌షిప్‌ను కస్టమర్‌లు సందర్శించవచ్చు. iVOOMi వెబ్‌సైట్ సమీప డీలర్‌షిప్‌ను సులభంగా కనుగొనడంలో సహాయపడుతుంది.

Jeet X ZE మోడల్‌ ఫీచర్ల విషయానికి వస్తే.. మొబైల్ యాప్‌కి కనెక్ట్ చేయగల స్మార్ట్ స్పీడోమీటర్ వంటి అనేక ఆధునిక ఫీచర్‌లతో ఉంటుంది. ఇది మీకు టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, మెసేజ్ నోటిఫికేషన్‌లను చూపిస్తుంది. అలానే మీ రైడ్ డేటా, బ్యాటరీ స్థితి (SOC అలర్ట్) నంబర్‌లు, బార్‌లు రెండింటిలోనూ స్పీడ్‌గా ఉంటుంది. స్టేటస్ బార్‌లో బ్యాటరీ శాతం, దాని స్థితి కూడా కనిపిస్తుంది.

iVOOMi ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి, పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడేలా వినియోగదారులను ప్రేరేపిస్తుంది. ఈ స్కూటర్ అసలు ధర రూ. 81,999గా ఉంది. అయితే దీనిపై రూ.10 వేల డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే ఈ రక్షాబంధన్‌ను ప్రత్యేకంగా చేయడానికి మీరు మీ సోదరికి ఈ స్కూటర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories