Infinix Zero 40 5G: స్టన్నింగ్ ఫీచర్స్.. ఇన్‌ఫినిక్స్ నుంచి కళ్లు చెదిరే ఫోన్.. అదిరేలా ఉన్న GoPro..!
Infinix Zero 40 5G: ఇన్‌ఫినిక్స్ Zero 40 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మొదటి సేల్ సెప్టెంబర్ 21 ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.
Infinix Zero 40 5G: ఇన్‌ఫినిక్స్ భారత్‌లో కొత్త జీరో సిరీస్ ఫోన్ Infinix ZERO 40 5Gని పరిచయం చేసింది. ఇది కంపెనీ ఇన్‌ఫినిక్స్ జీరో 30 5G సక్సెసర్‌గా రానుంది. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీన్ని సింగిల్ టచ్‌తో యూజ్ చేయొచ్చు. ఇది 24 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇన్‌ఫినిక్స్ ఈ కొత్త ఫోన్‌లో Infinix AI కూడా ఉంది. ఫోన్ GoProకి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Infinix Zero 40 5G Price
ఇన్‌ఫినిక్స్ Zero 40 5G రెండు వేరియంట్లలో వస్తుంది. అందులో 12GB RAM+256GB స్టోరేజ్ కలిగిన ఫోన్ బేస్ మోడల్ ధర రూ.27,999. 12GB RAM+512GB స్టోరేజ్‌తో ఉన్న ఇతర వేరియంట్ ధర రూ. 30,999. Infinix Zero 40 5G మొదటి సేల్ సెప్టెంబర్ 21 నుండి Flipkart ద్వారా జరగబోతోంది.
Arey dekho kaun aaya!😍
— Infinix India (@InfinixIndia) September 18, 2024
Infinix ZERO 40 5G starts at just ₹24,999* with:
📽️Segment's 1st 4K 60fps front and rear video
📸108MP OIS AI Triple Cam
🦋Colors co-created with WGSN
🎬Controls for GoPro
And more!
Check it out: https://t.co/aCQgGCChr9
Sale starts 21st Sept. pic.twitter.com/zsou2zmvv5
జీరో 40 5G వైలెట్ గార్డెన్, మూవింగ్ టైటానియం, రాక్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో ఫోన్ రూ. 3000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ. 24,999, టాప్ వేరియంట్‌ను రూ. 27,999కి కొనుగోలు చేయవచ్చు.
Infinix Zero 40 5G Features
ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12GB RAMతో 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఇన్‌ఫినిక్స్ Zero 40 5G 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో సామ్‌సంగ్ ISOCELL HM6 సెన్సార్, OIS, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన 108MP వెనుక మెయిన్ కెమెరా ఉంది. GoPro మోడ్ అనేది ముందుగా ఇన్‌స్టాల్ చేయబడిన GoPro క్విక్ యాప్‌తో షూటింగ్ మోడ్. ZERO 40 5G ఫోటోగ్రఫీ కోసం AI ఫీచర్లను కలిగి ఉంటుంది.
అలానే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14.5 రన్ అవుతుంది. ఫోన్ 3 సంవత్సరాల భద్రతా అప్‌డేట్లు, 2 సంవత్సరాల Android అప్‌డేట్‌లను పొందుతుంది. ఫోన్ ర్యామ్‌ను 24 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది పవర్ కోసం 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 20W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire