Hyundai: ఒక్క సారి ఛార్జ్ చేస్తే 620కిమీ ప్రయాణం.. 10 ఎయిర్‌బ్యాగ్‌లు.. హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది

Hyundai Ioniq 9 Electric SUV
x

Hyundai Ioniq 9 Electric SUV 

Highlights

Hyundai Ioniq 9 Electric SUV: హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోకు కొత్త మోడల్‌ను యాడ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ ఐయోనిక్ 9ని పరిచయం చేసింది.

Hyundai Ioniq 9 Electric SUV: హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోకు కొత్త మోడల్‌ను యాడ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ ఐయోనిక్ 9ని పరిచయం చేసింది. హ్యుందాయ్ ఐయోనిక్ 9 మూడు వరుసల సీట్లు కలిగినటువంటి ఎస్ యూవీ . ఇది అనేక అధునాతన ఫీచర్లు, అద్భుతమైన మోడల్ తో ఈ కారును తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దీని రేంజ్ 620కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది కంపెనీ E-GMP ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది 350kW ఛార్జర్‌తో 24 నిమిషాల్లో 10 నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది 2025 ప్రథమార్థంలో కొరియా, అమెరికాలో మొదట అమ్మకాలు జరుపనుంది. తరువాత ఇది యూరోపియన్, ఇతర మార్కెట్లలో ప్రవేశపెట్టబడుతుంది. హ్యుందాయ్ అయానిక్ 9 బ్యాటరీ ప్యాక్ 110.3 kWh. ఇది పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 620కిమీల పరిధిని క్లెయిమ్ చేస్తుంది. దీనికి 19-అంగుళాల వీల్స ఉంటాయి. ఇది 400V - 800V ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది వెహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్‌ను కలిగి ఉంది.

RWD, AWD ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీని LR RWD వేరియంట్ 218హెచ్ పీ శక్తిని , 350ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వెనుక యాక్సిల్-మౌంటెడ్ మోటారును కలిగి ఉంది, ఇది 0-100 kmph నుండి 9.4 సెకన్లలో.. 80-120 kmph నుండి 6.8 సెకన్లలో వేగాన్ని అందుకుంటుంది. అయితే, టాప్-స్పెక్ మోటార్ 218 హెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5.2 సెకన్లలో 0 నుండి 100 kmph, 3.4 సెకన్లలో 80-120 kmph వరకు వేగాన్ని అందుకుంటుంది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ 7-సీట్ కాన్ఫిగరేషన్‌లతో రానుంది. మొదటి రెండు వరుస సీట్లలో మసాజ్ ఫంక్షన్ అందుబాటులో ఉంది. రెండవ వరుస సీట్లను 180 డిగ్రీల వరకు తిప్పవచ్చు. ఇది సర్దుబాటు చేయగల కన్సోల్‌ను కలిగి ఉంది. దీనిని హ్యుందాయ్ యూనివర్సల్ ఐలాండ్ 2.0 అని పిలుస్తారు. ఇది అడ్జస్ట్ చేయగల ఆర్మ్‌రెస్ట్‌ను కలిగి ఉంది. దీనిని రెండవ వరుస నుండి యాక్సెస్ చేయవచ్చు. దీని ఎగువ , దిగువ ట్రేలు 5.6 లీటర్లు, 12.6 లీటర్ల నిల్వను కలిగి ఉంటాయి.

ఇది 620 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇది మూడవ వరుసను సీట్లు హోల్డ్ చేసినప్పుడు 1,323 లీటర్లకు పెరుగుతుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 12-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉన్నాయి. అదనంగా, ఇది యాంబియంట్ లైటింగ్, రూఫ్-మౌంటెడ్ ఎయిర్ వెంట్స్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మూడు వరుసలలో 100W USB-C పోర్ట్ , 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 14-స్పీకర్ బోస్ సిస్టమ్‌ను పొందుతుంది.


సేఫ్టీ కోసం ఇందులో 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్, మూడవ వరుస ప్రయాణికుల కోసం లోడ్ లిమిటర్ ఉన్నాయి. ఇది డిజిటల్ సైడ్ మిర్రర్‌లతో కూడిన వెర్షన్‌లను కలిగి ఉంది. ఇది 7-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో జూమ్ అవుట్, నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 5060ఎంఎం పొడవు, 1980ఎంఎం వెడల్పు, 1790ఎంఎం ఎత్తు. దీని వీల్ బేస్ 3130ఎమ్ఎమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories