Upcoming EVs: మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. రానున్న రోజుల్లో దండయాత్రే..!

Upcoming EVs
x

Upcoming EVs

Highlights

Upcoming EVs: రానున్న 12 నుండి 18 నెలల్లో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో అనేక కొత్త మోడల్‌లు రానున్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, కియా వంటి కార్ల కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

Upcoming EVs: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల దండయాత్ర కొనసాగుతుంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పోటాపోటీగా ఈవీలను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న 12 నుండి 18 నెలల్లో ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో అనేక కొత్త మోడల్‌లు రానున్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, కియా వంటి కార్ల కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Mahindra XUV 3XO EV ( మహీాంద్రా XUV 3XO EV ఈవీ )
మహీంద్రా ఈ సంవత్సరం చివరి నాటికి XUV 3XO EVని విడుదల చేయనుంది. ఇది టాటా పంచ్ EVకి పోటీగా XUV 400 వెహికల్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. బ్యాటీరీ ప్యాక్‌తో సహా అనేక ఇతర ఫీచర్లు ఒకేలా ఉంటాయి. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 350-400 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

Maruti Suzuki eVX ( మారుతి సుజికి eVX)
మారుతి సుజుకి eVXని 2025 జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. కాన్సెప్ట్ లాగా, 60 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇది 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. టయోటా సిబ్లింగ్ మోడల్ కూడా 2025 ద్వితీయార్థంలో ప్రారంభించవచ్చు. రెండూ టయోటా 27 PL ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి.

(Hyundai Creta EV (హ్యుందాయ్ క్రెటా EV)
క్రెటా ఈవీని కంపెనీ అనేక సార్లు టెస్ట్ చేసింది. ఇది వచ్చే ఏడాది రోడ్లపైకి రానుంది. ప్రస్తుతానికి భారతీయ మార్కెట్లో నిలిపివేయబడిన బేస్-స్పెక్ కోనా ఎలక్ట్రిక్ నుండి ఎలక్ట్రిక్ మోటారు తీసుకొనే అవకాశం ఉంది. దీని డిజైన్ ఎక్కువగా ICE క్రెటా నుండి ప్రేరణ పొందింది. దీని రేంజ్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

Mahindra XUV.e8 (మహీంద్రా XUV.e8)
మహీంద్రా XUV.e8 డిసెంబర్ 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. XUV.e8 వచ్చే ఏడాది జనవరిలో అమ్మకానికి రానుంది. XUV 700 ICE ఆధారిత ఈ ఎలక్ట్రిక్ SUV డిజైన్ పరంగా దాదాపు కాన్సెప్ట్‌తో సమానంగా ఉంటుంది. దీని ఇంటీరియర్‌లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories