Tata Altroz: ఈ టాటా కారుకు తగ్గిన క్రేజ్.. క్షీణించిన అమ్మకాలు.. ఎందుకంటే..?

Tata Altroz
x

Tata Altroz

Highlights

Tata Altroz: జులై 2024లో టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. క్ సేల్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

Tata Altroz: దేశంలో టాటా కార్లకు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిలో టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా సఫారి, టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లు ఉన్నాయి. అయితే గత నెలలో అంటే జులై 2024లో టాటా కంపెనీకి చెందిన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. టాటా ఆల్ట్రోజ్ గత నెలలో 3,444 యూనిట్లను విక్రయించి టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ సేల్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఈ టైమ్‌లో ఆల్ట్రోజ్ అమ్మకాల్లో 56 శాతం క్షీణత కనిపించింది. గత ఏడాది జులై 2023లో టాటా ఆల్ట్రోజ్ కారు మొత్తం 7,817 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజికి స్విఫ్ట్ 16,854 యూనిట్ల కార్లను విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. టాటా ఆల్ట్రోజ్ ఫీచర్లు, పవర్ ట్రెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా ఆల్ట్రోజ్‌లో 3 పవర్‌ట్రెయిన్‌లు ఉంటాయి. మొదటిది 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. రెండవది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో ఉంటుంది. ఇది గరిష్టంగా 86.83bhp పవర్, 113Nm పీక్ టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఈ కారులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 88.77bhp పవర్, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కాకుండా కారులో CNG పవర్‌ట్రెయిన్ కూడా ఉంది.

ఇది గరిష్టంగా 73.5bhp పవర్ 103Nm టార్క్‌ రిలీజ్ చేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ CNG వేరియంట్ దాని వినియోగదారులకు 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఇంటీరియర్‌లో ఫ్రంట్, రియర్ పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అడ్జస్టబుల్ హెడ్‌లైట్లు, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ లైట్లు, రియర్ డీఫాగర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, పవర్ యాంటెన్నా వంటి ఫీచర్లు ఉన్నాయి.

అలానే భద్రత కోసం కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లో టయోటా గ్లాంజా, మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20 మరియు మారుతి సుజుకి స్విఫ్ట్‌లతో పోటీపడుతోంది. Toyota Altroz ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌లో రూ. 6.65 లక్షల నుండి రూ. 11.35 లక్షల వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories