Car Gear Rules: ఏ గేర్‌లో కారు నడిపితే మైలేజీ పొందవచ్చు.. ఈ విషయాలు తెలిస్తే ఖర్చు తగ్గుతుంది..!

If you Drive a Car in Any Gear you can Get Mileage Knowing these things will Reduce the Cost
x

Car Gear Rules: ఏ గేర్‌లో కారు నడిపితే మైలేజీ పొందవచ్చు.. ఈ విషయాలు తెలిస్తే ఖర్చు తగ్గుతుంది..!

Highlights

Car Gear Rules: ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ రోజుల్లో కారు మెయింటెన్‌ చేయడం కష్టంగా మారింది. అందుకే మారిన పరిస్థితులకి అనుగుణంగా డ్రైవింగ్‌ శైలిని మార్చుకోవాలి.

Car Gear Rules: ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ రోజుల్లో కారు మెయింటెన్‌ చేయడం కష్టంగా మారింది. అందుకే మారిన పరిస్థితులకి అనుగుణంగా డ్రైవింగ్‌ శైలిని మార్చుకోవాలి. ముఖ్యంగా కారుని అద్భుతమైన మైలేజీతో నడిపించాలి. అప్పుడే మెయింటెనెన్స్‌ ఖర్చు తగ్గుతుంది. వాస్తవానికి కారు మైలేజ్ దాని ఇంజిన్, సర్వీసింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీ డ్రైవింగ్ శైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏ గేర్‌లో కారును నడిపితే మంచి మైలేజీ పొందవచ్చో ఈరోజు తెలుసుకుందాం.

కారుకు ఏ గేర్ ఉత్తమం

కారు నుంచి ఉత్తమ మైలేజీని పొందడానికి దానిని టాప్ గేర్‌లో నడపాలి. గంటకి 70 నుంచి 80 కి.మీ. వేగం ఉండాలి. అయితే ట్రాఫిక్‌లో ఇంత వేగాన్ని సాధించడం కష్టం. ఒకటి లేదా రెండవ గేర్‌లో కారును నడిపితే మైలేజ్ తక్కువగా ఉంటుంది. అందుకే 4వ లేదా 5వ గేర్ వాడాలి. చాలా కార్లలో 6వ గేర్ కూడా ఉంటుంది. హైవేలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దీని కారణంగా హైవేలో మంచి మైలేజీని పొందవచ్చు.

సిటీ డ్రైవింగ్‌లో మైలేజీని పొందడం ఎలా?

సిటీ డ్రైవింగ్‌లో మంచి మైలేజ్ పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. సిటీ డ్రైవింగ్ సమయంలో ఎక్కువ వేగంగా వాహనాన్ని నడపలేరు. కాబట్టి తక్కువ గేర్‌లలోనే కారును నడపాలి. ఈ సందర్భంలో సరైన మైలేజీని పొందడానికి RPM గురించి జాగ్రత్త వహించాలి. వేగం RPM మీటర్ 1500 నుంచి 2000 మధ్య ఉండేలా చూసుకోవాలి.

కారు మైలేజీని పెంచడానికి చిట్కాలు

1. కారులో మైలేజ్ ఇంజిన్ పరిమాణం, ట్రాన్స్మిషన్ రకం, డ్రైవింగ్ శైలి మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2. ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసి, తరచుగా మారుస్తూ ఉండాలి. డర్టీ ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ పనితీరును తగ్గిస్తుంది. ఇది కారు మైలేజీపై ప్రభావం పడుతుంది.

3. క్రమం తప్పకుండా టైర్లలో సరైన గాలిని మెయింటెన్‌ చేయాలి. దీనివల్ల కారు మైలేజీలో పెద్ద మార్పు ఉంటుంది.

4. క్రమం తప్పకుండా ఇంజిన్ ఆయిల్ మార్చాలి. చమురు చెడిపోయినట్లయితే ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories