Bike Mileage Tips: ఈ చిట్కాలు పాటిస్తే బైక్‌ సూపర్‌ మైలేజీ ఇస్తుంది.. అవేంటంటే..?

If These Tips Are Followed The Bike Will Give Super Mileage The Cost Will Also Be Reduced
x

Bike Mileage Tips: ఈ చిట్కాలు పాటిస్తే బైక్‌ సూపర్‌ మైలేజీ ఇస్తుంది.. అవేంటంటే..?

Highlights

Bike Mileage Tips: నేటి రోజుల్లో ఇంధన రేట్లు పెరగడంతో సామాన్యుడి జేబు గుల్లవుతుంది. సాధారణంగా బైకులు వాడేవారు ఎక్కువగా మధ్యతరగతి వారే ఉంటారు.

Bike Mileage Tips: నేటి రోజుల్లో ఇంధన రేట్లు పెరగడంతో సామాన్యుడి జేబు గుల్లవుతుంది. సాధారణంగా బైకులు వాడేవారు ఎక్కువగా మధ్యతరగతి వారే ఉంటారు. ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రయణం చేయడం వీరికి కష్టంగా మారింది. ఇలాంటి వారు బైక్‌ మైలేజీపై దృష్టి పెడితే ఎంతో కొంత ఆదా చేయవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్ బైక్‌ను కొనుగోలు చేసినప్పుడు దాని నుంచి కచ్చితంగా మైలేజీ ఆశిస్తారు. కానీ కాలక్రమేణా బైక్ మైలేజ్ తగ్గుతుంది. ఈ రకమైన సమస్యను చాలా మంది ఎదుర్కొంటారు. అందుకే ఈ రోజు బైక్‌ మైలేజీ చిట్కాల గురించి తెలుసుకుందాం.

రెగ్యులర్‌ సర్వీసింగ్‌

బైక్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. దీనివల్ల బైక్ సరిగ్గా పని చేస్తుంది. ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

టైర్లలో గాలి

బైక్‌ టైర్లలో గాలి సరిపోనూ ఉండాలి. అప్పుడే ఇంధనం ఆదా అవుతుంది. అంటే బైక్ ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

ఓవర్‌ స్పీడ్‌ వద్దు

అతివేగం ప్రమాదకరం ఇది మైలేజీని కూడా దెబ్బతీస్తుంది. ఓవర్ స్పీడ్ వల్ల ఇంధన వినియోగం పెరిగి మైలేజీ తగ్గుతుంది. ఎల్లప్పుడూ సురక్షితమైన వేగంతో డ్రైవ్ చేస్తే మంచిది.

అనవసరమైన బ్రేకింగ్‌ వద్దు

అనవసరమైన బ్రేకింగ్ వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. బ్రేకింగ్‌ను తగ్గించడానికి ప్రయత్నించండి. అవసరమైతే బ్రేకులు వేయండి. వేగాన్ని అదుపులో ఉంచుకోండి.

బైక్ శుభ్రత

మైలేజ్ అంటే ఏమిటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వాస్తవానికి బైక్ శుభ్రంగా ఉంటే ఇంజిన్ కూడా శుభ్రంగా ఉంటుంది. ఇది ఇంజిన్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

సరైన గేర్‌లో వెళ్లండి

ఎల్లప్పుడూ సరైన గేర్‌లో బైక్‌ను నడపండి. ఇది ఇంజిన్ సమర్థవంతంగా పని చేయడానికి ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. అంటే మైలేజీ పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories