Hyundai Upcoming Electric Cars: హ్యుందాయ్ హవా.. త్వరలో మూడు ఈవీలు లాంచ్!

Hyundai Upcoming Electric Cars
x

Hyundai Upcoming Electric Cars

Highlights

Hyundai Upcoming Electric Cars: హ్యుందాయ్ (Hyundai) త్వరలో భారతదేశంలో 3 ఎలక్ట్రిక్ కార్లను (Electric Cars) విడుదల చేయబోతోంది.

Hyundai Upcoming Electric Cars: గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలలో నిరంతర పెరుగుదల ఉంది. కార్ కంపెనీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వాహనాలను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉంది. ఆ తర్వాత, మహీంద్రా, బీవైడీ, ఎమ్‌జీ వంటి బ్రాండ్లు EV విభాగంలో తమ పట్టును బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

మారుతీ సుజుకీ కూడా తన కొత్త ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది విడుదల చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే EV సెగ్మెంట్‌లో ఉంది కానీ ఇప్పుడు కంపెనీ బడ్జెట్ విభాగంలోకి కూడా ప్రవేశించబోతోంది. హ్యుందాయ్ త్వరలో భారతదేశంలో 3 ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతోంది. అందులో క్రెటా EV అగ్రస్థానంలో ఉంది. బడ్జెట్ సెగ్మెంట్ నుండి కస్టమర్లను ఆకర్షించడంపై కంపెనీ దృష్టి ఉంటుంది. హ్యుందాయ్ రాబోయే మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం...

హ్యుందాయ్ వెన్యూ ఈవీ (Next-gen Venue EV)

హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ ఎలక్ట్రిక్ (Venue EV) మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది Nexon EVకి పోటీగా ఉంటుంది. అయితే హ్యుందాయ్ ఈ కొత్త EV మోడల్‌పై పనిచేస్తోందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. వెన్యూ ఎలక్ట్రిక్ SUV డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదు కానీ కొన్ని చిన్న మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EPS, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ల సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ సదుపాయం ఉంది.

హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ (Hyundai Inster EV)

హ్యుందాయ్ (Hyundai) భారతదేశంలో Inster EV పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. ఇది 2026 సంవత్సరంలో విడుదల కానుంది. ఇది తక్కువ-బడ్జెట్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV. భారతదేశంలో ఇది టాటా పంచ్ EVతో పోటీపడుతుంది. ఇది ఇది ఎంట్రీ లెవల్ విభాగంలో వస్తుంది. దీని పరిధి 400 కిలోమీటర్లు కూడా ఉంటుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EPS, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ల సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ సౌకర్యం ఉంది.



హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)

హ్యుందాయ్ (Hyundai) ప్రసిద్ధ ఎస్‌యూవీ క్రెటా ఎలక్ట్రిక్ (Creta EV) వేరియంట్ లాంచ్ చేయనుంది. ఇది Creta EV టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. నివేదికల ప్రకారం Creta EVలో 45kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. దీని పరిధి దాదాపు 450 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేయగా, రియల్ రేంజ్ 350 కిలోమీటర్లుగా అంచనా. హ్యుందాయ్ క్రెటా EVలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 138bhp శక్తిని, 255Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. భారతదేశంలో దీని ధర 18 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది.




ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో అందుబాటులో ఉన్న క్రెటా, దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కూడా. దీని అమ్మకాలు ప్రతి నెలా అగ్రస్థానానికి చేరుకుంటాయి. దీని ధర రూ.11 లక్షల నుంచి మొదలవుతుంది. క్రెటా కస్టమర్లకు అత్యంత ఇష్టమైన SUVగా నిలిచినట్లే, దాని EV మోడల్ కూడా కస్టమర్లకు నచ్చుతుందని కంపెనీ భావిస్తోంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EPS, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ల సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories