Hyundai Exter: త్వరపడండి.. రూ.6.13 లక్షల విలువైన ఈ హ్యుందాయ్ ఎస్ యూవీ పై భారీ తగ్గింపు..!

Hyundai Exter is Available Upto RS 30000 Cheaper in November
x

Hyundai Exter: త్వరపడండి.. రూ.6.13 లక్షల విలువైన ఈ హ్యుందాయ్ ఎస్ యూవీ పై భారీ తగ్గింపు..!

Highlights

Hyundai Exter: గత కొన్నేళ్లుగా భారతీయ కస్టమర్లలో ఎస్ యూవీ విభాగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

Hyundai Exter: గత కొన్నేళ్లుగా భారతీయ కస్టమర్లలో ఎస్ యూవీ విభాగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతదేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో ఎస్ యూవీ సెగ్మెంట్ మాత్రమే 52శాతం వాటాను కలిగి ఉంది. దీనిన బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ విభాగానికి ఎంత డిమాండ్ ఉందో. మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో కొత్త ఎస్ యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే గుడ్ న్యూస్. నవంబర్ నెలలో హ్యుందాయ్ తన ప్రసిద్ధ ఎస్ యూవీ ఎక్సెటర్‌పై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

వార్తా వెబ్‌సైట్ gaadiwaadiలో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం.. వినియోగదారులు నవంబర్ 2024లో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ని కొనుగోలు చేయడం ద్వారా రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం, కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. హ్యుందాయ్ ఎక్సెటర్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యుయల్ కెమెరాతో కూడిన డాష్ క్యామ్ వంటి ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్సెటర్ రానుంది.

సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్ హోల్డ్ అసిస్ట్, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు వంటివి అందించింది కంపెనీ. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డే-నైట్ IRVM, రియర్‌వ్యూ కెమెరా, రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లు దాని టాప్ లైన్ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే, హ్యుందాయ్ ఎక్సెటర్‌లో 2 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికతో గరిష్టంగా 83bhp, 114Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడింది.

అయితే, రెండవది 1.2-లీటర్ పెట్రోల్-CNG ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది, ఇది గరిష్టంగా 69bhp శక్తిని, 95Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ ఎక్సెటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుండి రూ. 10.28 లక్షల వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories