Hyundai EV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు నాన్‌స్టాప్ జర్నీ.. హ్యుందాయ్ క్రెటా లాంచ్ ఎప్పుడంటే?

Hyundai Electric Creta Suv Launch Very Soon Features And Price Details Check Here
x

Hyundai EV: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు నాన్‌స్టాప్ జర్నీ.. హ్యుందాయ్ క్రెటా లాంచ్ ఎప్పుడంటే?

Highlights

Hyundai Creta EV: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో హ్యుందాయ్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ SUVలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Hyundai Creta EV: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో హ్యుందాయ్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హ్యుందాయ్ కంపెనీ లేటెస్ట్ మోడల్‌ను టెస్టింగ్ కూడా చేసేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఎప్పుడు లాంచ్ చేయనుంది, ధర, ఫీచర్లలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పటికే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్‌ అమ్మకాల్లో దూసుకపోతోంది. అలాగే క్రెటాను కూడా ఎలక్ట్రిక్ రూపంలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఎలక్ట్రిక్ కార్ 2025 నాటికి భారత మార్కెట్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ కార్‌ టెస్టింగ్ ఇప్పటికే మొదలైంది. ఇందులో 136 హార్స్ పవర్ మోటార్, 39.2 Kwh బ్యాటరీ ఇవ్వవచ్చు. దీని కారణంగా ఒక్కాసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ దూరం వరకు దూసుకపోవచ్చు. ఇందులో 2 Kwh బ్యాటరీ అందించారు.

ఈ ఎలక్ట్రిక్ కార్లలో కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్-5 ఎలక్ట్రిక్ SUVలు ఉన్నాయి. ఇవి కాకుండా రాబోయే కాలంలో కంపెనీ నుంచి మరిన్ని కార్, SUVలను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావచ్చని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories