Hyundai Creta EV Top 5 Features: క్రెటా ఈవీ.. అంచనాలు పెంచుతున్న టాప్-5 ఫీచర్స్ ఇవే

Hyundai Creta EV To be unveile January 17, 2025, to 5 Features of this Car
x

Hyundai Creta EV Top 5 Features: క్రెటా ఈవీ.. అంచనాలు పెంచుతున్న టాప్-5 ఫీచర్స్ ఇవే

Highlights

Hyundai Creta EV Top 5 Features: హ్యుందాయ్ ఇండియా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీని జనవరి 17న విడుదల చేయబోతోంది

Hyundai Creta EV Top 5 Features: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీని జనవరి 17న హ్యుందాయ్ విడుదల చేయబోతోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ కోసం కార్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇది కంపెనీ ఫేమస్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్. క్రెటా ఈవీ భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది.

కొత్తగా వచ్చే Creta EV ముఖ్యమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

1. హ్యుందాయ్ క్రెటా ఇప్పటివరకు భారతదేశంలో 11 లక్షలకు పైగా ఎస్‌యూవీలను విక్రయించింది. కొత్తగా మార్కెట్లోకి రానున్న Creta EV పై చాలా పెద్ద అంచనాలు ఉన్నాయి.

2. హ్యుందాయ్ క్రెటా ఈవీలో 42కెడబ్ల్యూహెచ్, 51.4కెడబ్ల్యూహెచ్ 2 బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చిన్న బ్యాటరీతో 390 కిమీ, పెద్ద బ్యాటరీ తో 473 కిమీ ప్రయాణం చేయవచ్చు.

3. మరోవైపు, హ్యుందాయ్ క్రెటా EV 7.9 సెకన్లలో 0 నుండి 100 కెఎమ్‌పిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు క్రెటా ఎలక్ట్రిక్‌లో మల్టీ డ్రైవ్ మోడ్‌లు కూడా ఉంటాయి,

4. క్రెటా ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా క్రెటా EVలో వాయిస్-యాక్టివేటెడ్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ కూడా అందించారు.

5. భద్రత కోసం క్రెటా ఎలక్ట్రిక్‌‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉంటాయి. అదనంగా ఈవీ 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్‌తో గేమ్-ఛేంజర్ లెవెల్-2 అడాస్ సూట్‌తో కూడా వస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories