Electric Cars: బడ్జెట్ రెడీ చేస్కోండి.. 500కి.మీ రేంజ్ లో మార్కెట్లోకి మూడు ఎలక్ట్రిక్ కార్లు.. ధర ఎంతంటే ?

Electric Cars
x

Electric Cars: బడ్జెట్ రెడీ చేస్కోండి.. 500కి.మీ రేంజ్ లో మార్కెట్లోకి మూడు ఎలక్ట్రిక్ కార్లు.. ధర ఎంతంటే ?

Highlights

Electric Cars: వచ్చే ఏడాది అంటే 2025లో టాటా మోటార్స్ నుంచి హ్యుందాయ్ ఇండియా వరకు కంపెనీలు వాటి అనేక ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి.

Electric Cars: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. సమీప భవిష్యత్తులో మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్తను పూర్తిగా చదవండి. ప్రముఖ వార్తా వెబ్ సైట్ ప్రచురించిన వార్తా కథనం ప్రకారం, వచ్చే ఏడాది అంటే 2025లో టాటా మోటార్స్ నుంచి హ్యుందాయ్ ఇండియా వరకు కంపెనీలు వాటి అనేక ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. రాబోయే మోడల్‌లో చాలా మంది ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ క్రెటా కూడా ఉంది. ఈ వార్తలో త్వరలో రాబోతున్నా మూడు ఎలక్ట్రిక్ మోడళ్లు, వాటి పీచర్స్, డ్రైవింగ్ పరిధి గురించి వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటా ఈవీ

హ్యుందాయ్ ఇండియా తమ బెస్ట్ సెల్లింగ్ కార్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో హ్యుందాయ్ క్రెటా ఈవీ లాంఛ్ కానుందని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ క్రెటాలో 45kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించబడుతుందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇది గరిష్టంగా 138bhpపవర్ ను, 255Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. క్రెటా ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.


మారుతీ సుజుకి విటారా

దేశంలోనే అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీని 2025 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబోతోంది. రాబోయే ఎలక్ట్రిక్ ఎస్ యూవీ మారుతి సుజుకి ఇ విటారా, దీనిలో 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్‌ ఆఫ్షన్లను కస్టమర్లు తమ అవసరం మేరకు ఉపయోగించవచ్చు. మారుతి సుజుకి ఇ విటారా వినియోగదారులకు ఒక్కసారి ఛార్జింగ్‌పై దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని అందించగలదని పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

టాటా హారియర్ ఈవీ

భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న టాటా మోటార్స్, దాని ప్రసిద్ధ ఎస్ యూవీ హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయబోతోంది. రాబోయే టాటా హారియర్ ఈవీ వచ్చే ఏడాది అంటే 2025లో భారతదేశంలోకి ప్రవేశిస్తుందని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. టాటా హారియర్ ఈవీ తన వినియోగదారులకు 60kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకే ఛార్జ్‌పై దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని అందించగలదు.

Show Full Article
Print Article
Next Story
More Stories