Hyundai Creta Record: టాటా నెక్సాన్, పంచ్ లను వెనక్కి నెట్టి మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించిన హ్యుందాయ్ క్రెటా..!

Hyundai Creta Become Most Sold SUV in November Leave Behind Tata Nexon Punch
x

Hyundai Creta Record: టాటా నెక్సాన్, పంచ్ లను వెనక్కి నెట్టి మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించిన హ్యుందాయ్ క్రెటా..!

Highlights

Hyundai Creta Record: ప్రస్తుతం భారతదేశంలో ఎస్ యూవీ కార్లకు భారీ డిమాండ్ ఉంది. హ్యుందాయ్ క్రెటా ఈ డిమాండ్‌ను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది.

Hyundai Creta Record: ప్రస్తుతం భారతదేశంలో ఎస్ యూవీ కార్లకు భారీ డిమాండ్ ఉంది. హ్యుందాయ్ క్రెటా ఈ డిమాండ్‌ను సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా మిడ్ సైజ్ వేరియంట్ విభాగంలో క్రెటా అత్యధికంగా అమ్ముడవుతోంది. దేశంలోని రెండవ అతిపెద్ద కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాది జనవరిలో తన కొత్త తరం క్రెటా మోడల్‌ను విడుదల చేసింది. అప్పటి నుండి దాని అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. నవంబర్ నెలలో క్రెటా అమ్మకాల్లో మరోసారి రికార్డు సృష్టించింది. టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి 5స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్నటు వంటి కార్లను కూడా వెనక్కి నెట్టింది.

కొత్త హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 160పీఎస్ అవుట్‌పుట్, 253 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ అలాగే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్ ఉంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ , 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా వస్తుంది.

హ్యుందాయ్ క్రెటా వృద్ధి 31 శాతం

హ్యుందాయ్ క్రెటా విక్రయాలు నవంబర్‌లో వార్షిక ప్రాతిపదికన 31 శాతం పెరిగాయి. నవంబర్ 2024లో దేశంలో మొత్తం 15,452 క్రెటా విక్రయాలు జరగగా, గతేడాది క్రెటా విక్రయం 11,814 యూనిట్లుగా ఉంది. ఇది మాత్రమే కాదు, గత నెల అంటే అక్టోబర్ 2024లో క్రెటా అమ్మకాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సమయంలో క్రెటా 17,497 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది అక్టోబర్ 2024లో 13,077 యూనిట్లతో పోలిస్తే 34 శాతం వృద్ధిని సాధించింది.

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 ఎస్ యూవీలు

నవంబర్ 2024లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీలు హ్యుందాయ్ కాకుండా, ఈ జాబితాలో టాటా పంచ్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి ఫ్రాంక్‌, మహీంద్రా స్కార్పియో వంటి వాహనాలు ఉన్నాయి. నవంబర్‌లో టాటా పంచ్ 15,435 యూనిట్లతో రెండవ స్థానంలో నిలవగా, టాటా నెక్సాన్ 15,329 యూనిట్లతో మూడవ స్థానంలో, బ్రెజ్జా 14,918 యూనిట్లతో నాల్గవ స్థానంలో, ఫ్రంట్ 14,882 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో మహీంద్రా స్కార్పియో (12,704 యూనిట్లు) ఆరో స్థానంలో, మారుతీ విటారా (10,148 యూనిట్లు) ఏడవ స్థానంలో, హ్యుందాయ్ వెన్యూ (9,754 యూనిట్లు) ఎనిమిదో స్థానంలో, కియా సోనెట్ (9,255 యూనిట్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా ఎక్స్‌యూవీ7000 (9,100 యూనిట్లు) పదో స్థానంలో నిలిచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories