Honda First EV: హోండా నుంచి ఫస్ట్ ఈవీ.. సింగిల్ ఛార్జ్‌పై 400 కిమీ రేంజ్..!

Honda Will Also Launch its First Electric Car in the Indian Market
x

Honda First EV: హోండా నుంచి ఫస్ట్ ఈవీ.. సింగిల్ ఛార్జ్‌పై 400 కిమీ రేంజ్..!

Highlights

Honda First EV: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

Honda First EV: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కూడా తన తొలి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం రాబోయే కారు కంపెనీ ప్రముఖ SUV హోండా ఎలివేట్ ఎలక్ట్రిక్ వేరియంట్. హోండా ఎలివేట్ EV విక్రయం వచ్చే ఏడాది అంటే 2025 నుండి భారత మార్కెట్లో ప్రారంభం కానుంది. కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ SUV సాధ్యమైన ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

రాబోయే హోండా ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో తయారై, ప్రపంచ మార్కెట్‌కు కూడా ఎగుమతి అవుతుంది. హోండా ఎలివేట్ EV టాటా కర్వ్ EV, మారుతి సుజుకి E విటారాతో పాటు భారతీయ మార్కెట్లో రాబోయే హ్యుందాయ్ క్రెటా EVకి పోటీగా ఉంటుంది. హోండా ఎలివేట్ EV కోసం సంవత్సరానికి 1 లక్ష యూనిట్లను విక్రయించాలని కంపెనీ ప్రాథమిక లక్ష్యాన్ని నిర్దేశించవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఇంకా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కి.మీ కంటే ఎక్కువ పరుగులు తీస్తుంది

మరోవైపు, రాబోయే ఎలక్ట్రిక్ SUV యొక్క పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే, దాని గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ, కంపెనీ హోండా ఎలివేట్ EVలో 40 నుండి 50kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్‌లో ఉంటుంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ కారుగా మారుతుంది. ఇది కాకుండా ఫీచర్లుగా, హోండా ఎలక్ట్రిక్ SUV డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. 360-డిగ్రీ పార్కింగ్ కెమెరాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories