Honda Small Bike: హోండా అతి చిన్న బైక్.. 125cc ఇంజిన్ 70 కిలోమీటర్ల మైలేజ్.. ధర తెలిస్తే షాక్..!
Honda Small Bike: ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హోండా యువతని టార్గెట్ చేసుకొని కొత్త కొత్త బైక్‌లని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది.
Honda Small Bike: ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హోండా యువతని టార్గెట్ చేసుకొని కొత్త కొత్త బైక్‌లని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా హోండా మంకీ 125 అనే అతి చిన్న బైక్‌ని విడుదల చేసింది. ఈ బైక్ జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ ఇటీవలే దాని కొత్త లైటింగ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బైక్ పసుపు రంగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఈ బైక్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం లేదు. దీనికి బదులుగా కంపెనీ హోండా నవీ అనే మినీ బైక్‌ను భారతదేశంలో విక్రయిస్తోంది.
ఇది గరిష్టంగా 9.2 bhp శక్తిని, 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 125cc ఇంజిన్ కలిగి ఉంటుంది. మునుపటి Monkey 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందగా ప్రస్తుత వెర్షన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని మైలేజీ లీటరుకు 70.5 కి.మీ అని కంపెనీ పేర్కొంది. హోండా మంకీకి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, ముందు వైపున ABS ఉంటాయి. నగర ప్రయాణానికి అనుకూలంగా 5.6 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇది పెరిగిన ఫ్రంట్ ఫెండర్, బ్లాక్ ప్యాటర్న్ టైర్‌ల కారణంగా ఆఫ్-రోడ్ ట్రాక్‌లను తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మంకీ లైట్నింగ్ ఎడిషన్ USD ఫోర్క్స్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, స్వింగ్‌ఆర్మ్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు మొత్తం పసుపు రంగులో ఉంటాయి. కంపెనీ ఈ బైక్‌ను థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. అక్కడి ధర ప్రకారం ప్రారంభ రేటు TBH 108,900 అంటే దాదాపు రూ. 2.59 లక్షలు. అలాగే స్టాండర్డ్ మంకీ వేరియంట్ ధర 99,700 THB (దాదాపు రూ. 2.38 లక్షలు). హోండా మంకీ ఈస్టర్ ఎగ్ ఎడిషన్‌ను కూడా వస్తుంది. దీని ధర 109,900 THB (దాదాపు రూ. 2.62 లక్షలు).
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire