Best Selling 125cc Bikes: బెస్ట్ 125 సీసీ బైక్స్.. ఇవి చూడకుంటే చిక్కుల్లో పడతారు!

Best Selling 125cc Bikes: బెస్ట్ 125 సీసీ బైక్స్.. ఇవి చూడకుంటే చిక్కుల్లో పడతారు!
x

Best Selling 125cc Bikes

Highlights

Best Selling 125cc Bikes: హోండా, బజాజ్, టీవీఎస్ కంపెనీలు 125 సీసీ సెగ్మెంట్‌లో బైక్‌లను అందిస్తున్నాయి. వీటిలో బెస్ట్ బైక్ ఇదే.

Best Selling 125cc Bikes: దేశంలో 125 సీసీ బైక్‌లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎందుకంటే ఇవి బెటర్‌గా మైలేజ్ అందిస్తాయి. అయితే ఇంతకుముందు ఈ సెగ్మెంట్‌లో 2-3 బైక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో ఉన్నాయి. అంతేకాకుండా లేటెస్ట్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్నాయి. కస్టమర్లు కూడా మంచి డిజైన్, ఫీచర్లు, పర్ఫామెన్స్ అందించే బైక్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Honda Shine 125
షైన్ భారతదేశంలో 125cc బైక్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. ప్రతి నెలా లక్షకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. జూన్ నెలలో హోండా 1,39,587 యూనిట్ల షైన్‌లను విక్రయించింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. ఇది స్ట్రాంగెస్ట్ ఇంజన్, కానీ డిజైన్ పరంగా షైన్ నిరాశపరిచింది. రైడ్ చేస్తున్నప్పుడు కూగా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది . బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.80,250 నుండి ప్రారంభమవుతుంది.

Bajaj Pulsar 125
పల్సర్ 125 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో రెండవది. ఈ బైక్‌లో పవర్ ఫుల్ ఇంజన్ ఉంటుది. ఇది మాత్రమే కాదు, దీని బోల్డ్ డిజైన్ యువతతో ఆకర్షిస్తుంది. జూన్ నెలలో బజాజ్ పల్సర్ 125 63,586 యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ బైక్ ప్లస్ పాయింట్ దాని బ్యాలెన్స్. బైక్ ధర రూ.82,207 నుంచి ప్రారంభమవుతుంది.

TVS Raider 125
టీవీఎస్ రైడర్ 125 జూన్ నెలలో 29,580 యూనిట్లను విక్రయించడం ద్వారా మూడవ అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా గుర్తింపు పొందింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని సెగ్మెంట్‌లో అత్యుత్తమ బైక్ అయినప్పటికీ రైడర్ సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రైడర్ ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. రెండవది, బలహీనమైన మార్కెటింగ్. రైడర్ టాప్ లెవల్ పర్ఫామెన్స్, బ్యాలెన్స్ అందిస్తుంది. బైక్ మైలేజీలో కూడా రాజీపడదు. ఈ బైక్ ఒక లీటర్‌లో 70 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. బైక్ ధర రూ.98,731 నుంచి ప్రారంభమవుతుంది.

Hero Glamour 125
హీరో మోటోకార్ప్ గ్లామర్ 125 సీసీ బైక్‌లలో నాల్గవ స్థానంలో ఉంది. జూన్ నెలలో కంపెనీ 24,159 యూనిట్లను విక్రయించింది. బైక్ డిజైన్‌ను కస్టమర్లు ఫిదా అవుతున్నారు. ఈ బైక్ పనితీరు పరంగా బాగానే ఉంటుంది. కానీ డిజైన్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. ఈ బైక్ ధర రూ.82,598 నుంచి ప్రారంభమవుతుంది.

Hero Super Splendor 125
హీరో స్ప్లెండర్ 125 జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ బైక్‌గా నిలిచింది. గత నెలలో కంపెనీ 21,396 యూనిట్లను విక్రయించింది. ఇది చాలా సింపుల్ గా డిజైన్ చేయబడిన బైక్. ఇందులో 125సీసీ ఇంజన్ ఉంది. అయితే దీని పర్ఫామెన్స్ అంత బాగా లేదు. అంతే కాదు ఈ బైక్ నడుపుతున్నప్పుడు రైడర్‌కు సేఫ్టీ తక్కువగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories