Hero Splendor Plus Xtech: ఇంతలా మారిపోయింది ఏంట్రా బాబు.. ఫ్రంట్ డిస్క్‌, స్మార్ట్ ఫీచర్లతో కొత్త స్ప్లెండర్..!

Hero Splendor Plus Xtech
x

Hero Splendor Plus Xtech

Highlights

Hero Splendor Plus Xtech: హీరో మోటోకార్ప్ కొన్ని అప్‌డేట్‌లతో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ విడుదల చేసింది. కంపెనీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో దీన్ని అప్‌డేట్ చేసింది.

Hero Splendor Plus Xtech: దేశీయ టూవీలర్ దిగ్గజాలు హీరో, హోండా విడిపోకముందు.. అంటే హీరో హోండా కలిసి ఉన్న సమయంలో ఆ కంపెనీకి చెందిన బైక్స్‌లో హీరో‌హోండా స్పెండర్ ఎంతో ప్రజాదరణ పొందిన బైక్. ఇది మైలేజీ, డిజైన్, లుక్ అన్ని విధాలుగా ఎదురులేని రారాజుగా ఉండేది. అత్యధికంగా సేల్ అవుతున్న బైక్స్‌లో ఇదే ముందు స్థానంలో ఉండేది. అయితే ఆ తర్వాత కొన్ని ఊహించని సంఘటనల కారణంగా రెండు కంపెనీలు విడిపోయాయి.

అనంతరం వివిధ కంపెనీలు నుంచి ఇదే ఫీచర్స్‌తో డిఫరెంట్ మోడల్స్‌ అందుబాటులోకి రావడంతో క్రమంగా దీని డిమాండ్ పడిపోయింది. అయినప్పటికీ స్పెండర్‌ను డైరెక్ట్‌గా ఢీకొట్టేందుకు ఏ కంపెనీ ధైర్యం చేయలేకపోయింది. బడ్జెట్ విభాగంలో ఇప్పటికీ నంబర్ వన్‌గా కొనసాగుతుంది.ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ కొన్ని అప్‌డేట్‌లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్ప్లెండర్‌ను విడుదల చేసింది.

మొట్టమొదటిసారిగా కంపెనీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో దీన్ని అప్‌డేట్ చేసింది. దీనికి Splendor Plus Xtec అని పేరు పెట్టారు. ఈ హార్డ్‌వేర్ అప్‌డేట్‌తో బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.83,461గా మారింది. అయితే, డ్రమ్ బ్రేక్ ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పటికీ రూ.79,911 వద్ద కొనసాగుతుంది. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.

స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డిజైన్ గురించి మాట్లాడితే కంపెనీ ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మాత్రమే కాదు, బైక్ మెకానిజంలో ఎటువంటి మార్పులు ఉండవు. అంటే ఇది ప్రస్తుత మోడల్‌కు సమానమైన ఇంజన్‌‌తో వస్తుంది. అలానే ఫీచర్లు కూడా కొనసాగుతున్న మోడల్ లాగానే అందుబాటులో ఉంటాయి. అదే స్లిమ్, పర్పస్‌ఫుల్ డిజైన్ ఇందులో ఉంటుంది. ఇది రెక్టాంగిల్ హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. బైక్‌లో LED DRLలు ఉన్నాయి.

హీరో Splendor Plus Xtec 100cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.09bhp పవర్, 8.05Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఇది ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన USB ఛార్జింగ్ స్లాట్‌ను కూడా కలిగి ఉంది. బైక్ సాధారణ డిజైన్‌ను ప్రజలు చాలా ఇష్టపడతారు. దీని కారణంగా ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్‌గా కూడా నిలిచింది.

ఇతర హార్డ్‌వేర్ ఫీచర్‌ల గురించి మాట్లాడితే ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో ఇప్పుడు అల్లాయ్ వీల్స్‌పై అమర్చబడిన ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో స్ప్లెండర్ హోండా షైన్, బజాజ్ ప్లాటినా, టీవీఎస్ రైడర్ వంటి మోడళ్లతో పోటీ పడుతోంది. అయితే ఈ మోడళ్లన్నీ సేల్‌లో స్ప్లెండర్‌కు చాలా వెనుకబడి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories