Electric Cycle Offer: త్వరగా కొనేయండి.. ధర తక్కువ... మైలేజ్ ఎక్కువ.. రూ.10కే.. 100కి.మీ ప్రయాణం..!

Hero Lectro H5 Electric Cycle Review Top Speed Mileage Battery and Cost Efficiency Explained
x

Electric Cycle Offer: త్వరగా కొనేయండి.. ధర తక్కువ... మైలేజ్ ఎక్కువ.. రూ.10కే.. 100కి.మీ ప్రయాణం..!

Highlights

Electric Cycle Offer: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి పర్యావరణానికి హానిని తగ్గించడమే కాకుండా.. ఇంధన ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి.

Electric Cycle Offer: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి పర్యావరణానికి హానిని తగ్గించడమే కాకుండా.. ఇంధన ఖర్చును కూడా తగ్గిస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది వీటిని కొంటున్నారు. వారి ఆసక్తిని ఆసరాగా చేసుకున్న కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ తగ్గింపులను, ప్రభుత్వం సబ్సిడీలను అందజేస్తున్నాయి. అంతే కాకుండా రోజుకో కొత్త మోడళ్లను కంపెనీలు మార్కెట్లోకి తెస్తున్నాయి.

ఈ-సైకిళ్లు కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. పెట్రోల్ ఖర్చు లేకుండా తక్కువ మెయింటెనెన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇ సైకిళ్లు రోజువారీ అవసరాలకు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. అన్ని రకాల రోడ్లపైనా వెళ్లగలుగుతాయి.

తక్కువ దూరాలకే రోజూ వెళ్లే అవసరం ఉంటే ఎలక్ట్రిక్ సైకిల్ బెటర్ అంటూ నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నుంచి వచ్చిన లెక్ట్రో హెచ్ 5(Lectro H5) ఎలక్ట్రిక్ సైకిల్ ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.28,999. దీని బ్యాటరీని ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 30 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల ఈ సైకిల్‌కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తో పనిలేదు.

ఇది రోజువారీ.. సిటీల్లో తక్కువ దూరాలు ప్రయాణం చేసేవారికి చాలా బాగుంటుంది. ప్రతి రోజూ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేసుకుంటూ ఉంటే.. ఎలాంటి సమస్యా ఉండదు. రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకునేవారికి ఇది చాలా బాగుంటుంది. ట్రాఫిక్‌లో ఆలస్యమైనా.. బ్యాటరీ పూర్తిగా అయిపోదు. ఈ సైకిల్‌రి 36V 5.8Ah లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 4 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది. అందువల్ల ప్రయాణం ముగిశాక.. ఇంటికి వచ్చి.. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసుకుంటే.. తిరిగి బయలుదేరేటప్పటికి.. ఫుల్ ఛార్జ్ తో రెడీగా ఉంటుంది. ఐతే.. బ్యాటరీని సైకిల్ నుంచి విడదీయడానికి మాత్రం వీలు లేదు. సైకిల్‌తోనే ఉంటుంది.

ఈ సైకిల్‌‌ బ్యాటరీతో వెళ్లేటప్పుడు.. తొక్కుతూ కూడా వెళ్తే.. బ్యాటరీ 40 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. అలా కాకుండా.. పూర్తిగా బ్యాటరీపైనే ఆధారపడితే.. 25 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇస్తుందని నిపుణులు తెలిపారు. దీనికి ముందుర LED డిస్‌ప్లే ఉంది. బాగా కనిపిస్తుంది. ఈ సైకిల్‌కి వాడకం ఖర్చు తక్కువే. 100 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10కి మించి అవ్వదు. అదే.. బైక్ అయితే.. రూ.200దాకా అవుతుంది. అందుకే చాలా మంది ఎలక్ట్రిక్ సైకిల్స్ కొనేసుకుంటున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే పెడల్స్ తో సైకిల్ తొక్కుతూ వెళ్లొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories