Hero Karizma XMR 210: హీరో నుంచి కొత్త కరిజ్మా స్పోర్ట్స్ బైక్.. ఆగస్ట్ 29న లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే?

Hero Karizma XMR 210 may Launched on August 29th Check Specs, Features, And Karizma XMR Price
x

Hero Karizma XMR 210: హీరో నుంచి కొత్త కరిజ్మా స్పోర్ట్స్ బైక్.. ఆగస్ట్ 29న లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే?

Highlights

Hero Karizma XMR 210: హీరో మోటోకార్ప్ ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ కరిజ్మాను లాంచ్ చేయబోతోంది.

Hero Karizma XMR 210: హీరో మోటోకార్ప్ ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ కరిజ్మాను లాంచ్ చేయబోతోంది. ఆగస్ట్ 29న విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ బైక్‌కి కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్ 210 అని కంపెనీ పేరు పెట్టింది. లాంచ్ చేయడానికి ముందు, కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బైక్‌పై ఉత్కంఠతను రేకెత్తించేలా చేసింది.

ఈ మేరకు Hero MotoCorp Xలో బైక్ వీడియోను షేర్ చేసింది. దీనితో పాటు, 'ఒక పేరు, మిలియన్ భావోద్వేగాలు. కొత్త కరిజ్మా XMR- 29.08.23న లాంచ్ అవుతోందని పేర్కొంది. హీరో ఈ కొత్త బైక్ పల్సర్,అపాచీ RTR లకు పోటీగా ఉంటుంది.

ప్రారంభ తేదీని వెల్లడించిన హృతిక్ రోషన్..

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ X లో T- షర్టు ధరించిన తన ఫొటోను పంచుకున్నారు. టీ-షర్ట్‌లో బైక్ పేరు, విడుదల తేదీ రాసి ఉంది. దీనితో పాటు 'మనమంతా ఎదురుచూస్తున్న కొత్త కరిజ్మా రీఎంట్రీ' అంటూ పేర్కొన్నారు.

Hero Karizma XMR 210: ఇంజన్ స్పెసిఫికేషన్‌లు..

Hero Karizma XMR 210లో కంపెనీ 210cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అందించవచ్చు. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ట్యూన్ చేయవచ్చు. మీడియా నివేదికలను విశ్వసిస్తే, ఈ ఇంజన్ 25bhp శక్తిని, 22Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hero Karizma XMR 210: అంచనా ధర..

మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ Hero Karizma XMR 210ని రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.80 లక్షల రేంజ్‌లో విడుదల చేయగలదని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories