Hero New Bike Launch: హీరో నుంచి బడ్జెట్ కిల్లర్.. లక్షకే 160 సీసీ ఇంజన్, డిస్క్ బ్రేక్.. లుక్ చూస్తే టెంప్ట్ అవ్వాల్సిందే..!

Hero Xtreme 160R
x

Hero Xtreme 160R

Highlights

Hero New Bike Launch: హీరో Xtreme 160R 2V 2024ని విడుదల చేసింది. కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.11 లక్షలు.

Hero New Bike Launch: భారతదేశంలో బైక్స్, స్కూటర్స్ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రతి ఇంట్లో కూడా రెండు బైకులు లేదా స్కూటర్లు ఉంటున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీటి వినియోగం ఎలా ఉందో? దేశీయ టూ వీలర్ రంగాన్ని ఎప్పటి నుంచో హీరో శాసిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీ సరికొత్త ఫీచర్స్, అప్‌డేట్స్‌తో కొత్త వాహనాలను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే హీరో తాజాగా Hero Xtreme 160R 2V 2024ని మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ ఇందులో కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

అయితే డిజైన్, స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఉన్న మోడల్‌కు సమానంగా ఉంటాయి. కొత్త హీరో ఎక్స్ ట్రీమ్ 160 ఆర్ సింగిల్ డిస్క్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటలో ఉంటుంది. మీరు దీన్ని స్టీల్ బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ బైక్‌ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు డ్రాగ్ రేస్ టైమర్‌ యాడ్ చేసింది. ఈ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్‌ను కలిగి ఉన్న మొదటి బైక్ ఇదే.

అప్‌డేట్ చేసిన ఎక్స్‌ట్రీమ్ 160R లో ప్రస్తుత మోడల్ ఇంజిన్ గురించి మాట్లాడితే,ఇది 163.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8,500rpm వద్ద 14.8bhp పవర్ 6,500rpm వద్ద 14Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం దీనిలో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.11 లక్షలు. భారతీయ మార్కెట్లో ఈ బైక్ బజాజ్ పల్సర్ N150, యమహా FZ బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది.

హీరో కొత్త ఎక్స్‌ట్రీమ్ 160R కొలతలు గురించి మాట్లాడితే వెనుక ప్రయాణీకుల సౌకర్యం కోసం సీటు ఫ్లాట్ చేయబడింది. అంతే కాదు సీటు ఎత్తు కూడా తగ్గించారు. ఈ బైక్ వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్ ఉంది. దానిపై 'H' ఆకారం హైలైట్ చేయబడింది. ఇందులో అన్ని LED లైటింగ్ సెటప్ చేశారు.

బైక్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే ఇది అడ్జస్ట్ చేయగల బ్రైట్‌నెస్‌తో ఇన్‌వర్స్ LCD కన్సోల్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేయడానికి USB ఛార్జర్ కూడా అందించారు. భద్రత గురించి చెప్పాలంటే బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ యూనిట్ ఉంది. అదే సమయంలో బ్రేకింగ్ కోసం, ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ సింగిల్ ఛానల్ ABS ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories