Car Care Tips: కారు నుంచి వచ్చే పొగను గమనించారా.. ఈ విషయాలు తెలుస్తాయి..!

Have you noticed the smoke coming from the car these things will be known
x

Car Care Tips: కారు నుంచి వచ్చే పొగను గమనించారా.. ఈ విషయాలు తెలుస్తాయి..!

Highlights

Car Care Tips: చాలామంది కారు కొంటారు కానీ దాని మెయింటనెన్స్‌ని పట్టించుకోరు. దీంతో కొద్దిరోజుల్లోనే అది రిపేరుకు వస్తుంది. కార్లు తొందరగా పాడవకుండా ఉండాలంటే వాటిని జాగ్రత్తగా గమనించాలి.

Car Care Tips: చాలామంది కారు కొంటారు కానీ దాని మెయింటనెన్స్‌ని పట్టించుకోరు. దీంతో కొద్దిరోజుల్లోనే అది రిపేరుకు వస్తుంది. కార్లు తొందరగా పాడవకుండా ఉండాలంటే వాటిని జాగ్రత్తగా గమనించాలి. కారులో ఏదైనా సమస్య ఉంటే అది పొగ ద్వారా మనకు సిగ్నల్‌ అందిస్తుంది. దానిని బట్టి సమస్య ఏంటో గుర్తించాలి. లేదంటే ఇంజిన్‌ దెబ్బతింటుంది. కార్ల నుంచి వెలువడే పొగ ఎలాంటి సమస్యలను తెలియజేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

నల్లటి పొగ

కారు నుంచి నల్లటి పొగ వస్తే ఇంధనం లీక్ అవుతుందని అర్థం చేసుకోండి. గాలి-ఇంధన నిష్పత్తిలో తేడా వచ్చినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అరిగిపోయిన నాజిల్‌ల వల్ల ఫ్యూయెల్ ఇంజెక్టర్ లీకేజీ వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. కారు నుంచి నల్లటి పొగ వస్తుంటే వెంటనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లి రిపేర్‌ చేయించడం ఉత్తమం.

నీలి పొగ

కొన్నిసార్లు పాత కార్లు నీలిరంగు పొగను విడుదల చేస్తాయి. దీని అర్థం ఏంటంటే ఇంజిన్ తప్పుగా పనిచేస్తోందని గుర్తించాలి. పిస్టన్ లేదా వాల్వ్ గైడ్ సీల్ దెబ్బతిన్న తర్వాత ఇలాంటి పొగ బయటకు వస్తుంది. వెంటనే మెకానిక్ కి చూపించి కారు రిపేర్ చేయించుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంజిన్‌ మొత్తం పాడవుతుంది.

తెల్లటి పొగ

కారు నుంచి తెల్లటి పొగ వస్తున్నా అప్రమత్తంగా ఉండాలి. కారు కూలెంట్ లీక్ అవ్వడం వల్ల ఇలాంటి పొగ వెలువడుతుంది. కూలెంట్‌ పని ఇంజిన్ చల్లగా చేయడం. ఒకవేళ ఇది పాడైపోయినట్లయితే ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్‌కి వెళ్లి రిపేర్‌ చేయించుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories