Hybrid Cars: అద్భుత మైలేజీ, కళ్లు చెదిరే ఫీచర్లు.. దేశంలో దూసుకెళ్తోన్న హైబ్రిడ్ కార్లు.. ధరలు వింటే..

From toyota to maruti suzuki these are best hybrid cars in india check price and and features
x

Hybrid Cars: అద్భుత మైలేజీ, కళ్లు చెదిరే ఫీచర్లు.. దేశంలో దూసుకెళ్తోన్న హైబ్రిడ్ కార్లు.. ధరలు వింటే హార్ట్ ఎటాకే..

Highlights

Best Hybrid Cars in India: భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు క్రేజ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కార్లు స్టైలిష్ లుక్‌తో పాటు మెరుగైన మైలేజీని కూడా ఇస్తాయి.

Best Hybrid Cars in India: భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు క్రేజ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కార్లు స్టైలిష్ లుక్‌తో పాటు మెరుగైన మైలేజీని కూడా ఇస్తాయి. ఈ కార్ల ధర లక్షల నుంచి కోట్ల వరకు ఉంటాయి.

2024 సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశంలో హైబ్రిడ్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ కార్ల జాబితాలో టయోటా, మారుతి సుజుకికి చెందిన అనేక మోడల్స్ ఉన్నాయి.

టయోటా క్యామ్రీ ఒక గొప్ప హైబ్రిడ్ కారు. ఈ కారు మొదటి త్రైమాసికంలో 754 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారులో 2487 cc ఇంజన్ ఉంది. ఇది 176 bhp శక్తిని అందిస్తుంది. 221 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ టయోటా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.46.17 లక్షలుగా ఉంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 23.57 kmpl నుంచి 24.89 kmpl మధ్య మైలేజీని ఇస్తుంది. ఈ కారులో రిమోట్ వెహికల్ ఇగ్నిషన్ ఫీచర్ ఇచ్చారు. కారులో పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.14 లక్షల నుంచి మొదలై రూ. 20.19 లక్షల వరకు ఉంటుంది. మొదటి త్రైమాసికంలో ఈ కారు 9,370 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ శక్తివంతమైన హైబ్రిడ్ కారు. కొత్త ఇన్నోవా హైక్రాస్ సరికొత్త 2.0-లీటర్ TNGA పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ కారులో 5వ తరం సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టయోటా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.77 లక్షల నుంచి మొదలై రూ. 30.98 లక్షల వరకు ఉంటుంది. మొదటి త్రైమాసికంలో ఈ కారు 14,442 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మారుతి గ్రాండ్ విటారా అత్యంత ప్రజాదరణ పొందిన హైబ్రిడ్ కార్లలో ఒకటి. Zeta Plus, Alpha Plus వేరియంట్‌లు 27.97 kmpl మైలేజీని అందిస్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారు 2,232 యూనిట్లు అమ్ముడయ్యాయి. గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతీ ఇన్విక్టో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1,210 యూనిట్లను విక్రయించింది. ఈ కారు 23.24 kmpl మైలేజీని ఇవ్వగలదు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.25.21 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఈ హైబ్రిడ్ కార్ల జాబితాలో లగ్జరీ కార్ల పేర్లు కూడా ఉన్నాయి. లెక్సస్ ES ఒక ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కారు. ఈ కారు 8.9 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ లగ్జరీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 63.10 లక్షల నుంచి మొదలై రూ. 69.70 లక్షల వరకు ఉంటుంది.

BMW XM 61.9 kmpl మైలేజీని పొందుతుంది. ఈ కారు 4.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ BMW కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.2.60 కోట్లుగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories