ఫ్యామిలీతో టూర్‌కి వెళ్లాలా.. ఈ కార్లు ఎంతో బెస్ట్.. బడ్జెట్‌లోనే కాదు, సేఫ్టీలోనూ కిర్రాకే..!

ఫ్యామిలీతో టూర్‌కి వెళ్లాలా.. ఈ కార్లు ఎంతో బెస్ట్.. బడ్జెట్‌లోనే కాదు, సేఫ్టీలోనూ కిర్రాకే..!
x
Highlights

టాటా హారియర్ ఒక గొప్ప కారు. టాటా మోటార్స్ ఈ కారు GNACP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందింది.

Family Trip SUV: మీరు మీ కుటుంబంతో కలిసి ఒక యాత్రకు వెళ్లాలనుకుంటే, ఇందుకోసం మెరుగైన వాహనం కోసం చూస్తున్నట్లయితే, భారతీయ మార్కెట్‌లో ఇటువంటి అనేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మీరు మీ కుటుంబంతో కలిసి ఒక చిరస్మరణీయ యాత్రలకు వెళ్లొచ్చు. ఈ వాహనాల్లో టాటా, హ్యుందాయ్, స్కోడా మోడల్స్ ఉన్నాయి. ఈ వాహనాల ధర రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉన్నాయి.

టాటా హారియర్..

టాటా హారియర్ ఒక గొప్ప కారు. టాటా మోటార్స్ ఈ కారు GNACP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, అధునాతన ESP వంటి అనేక భద్రతా ఫీచర్లు అందించింది. ఈ టాటా కారులో వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఉంది. కారులో ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన డిజిటల్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది.

టాటా హారియర్ 25 వేరియంట్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు నాలుగు కలర్ వేరియంట్‌లతో వస్తుంది. ఈ కారులో అమర్చిన ద్వి-ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ కారుకు మెరుగైన రూపాన్ని ఇస్తుంది. ఈ 5-సీటర్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ క్రెటా N లైన్..

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ 5-సీటర్ కారు. ఈ కారు ఆటోమోటివ్ టెక్నాలజీలో కొత్త ప్రమాణాలతో వచ్చింది. ఈ కారులో 10.25-అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అదనంగా, 10.25-అంగుళాల మల్టీ-లాంగ్వేజ్ UI డిస్‌ప్లేతో డిజిటల్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉంది. ఈ హ్యుందాయ్ కారులో బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, శక్తివంతమైన భద్రతా ఫీచర్లు కూడా అందించింది.

ఈ హ్యుందాయ్ కారులో ముందు వరుసలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఈ కారు డ్రైవర్ సీటును ఎనిమిది రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు. కారులో SOS బటన్‌తో కూడిన ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్ ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.82 లక్షల నుంచి మొదలై రూ. 20.45 లక్షల వరకు ఉంది. గ్లోబల్ NCAP కూడా ఈ కారుకు భద్రతలో 5-స్టార్ రేటింగ్ ఇచ్చింది.

స్కోడా కుషాక్..

స్కోడా కుషాక్ డీప్ బ్లాక్ కలర్‌లో ఎలిగాన్స్ ఎడిషన్‌తో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు సబ్-బఫర్‌తో పాటు 25.4 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కారులో VEGA సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్కోడా కుషాక్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా అందించచింది. ఈ స్కోడా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.89 లక్షల నుంచి మొదలై రూ. 18.79 లక్షల వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories