Cars Under Rs 10 Lakhs: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలోనే.. ఫుల్ సేఫ్టీ ఫీచర్లతో మైండ్ బ్లాక్ చేస్తోన్న 8 కార్లు..!

From Renault Triber to Renault Kiger including these 8 8 Suv And Mpv Under Rs 10 Lakhs
x

Cars Under Rs 10 Lakhs: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలోనే.. ఫుల్ సేఫ్టీ ఫీచర్లతో మైండ్ బ్లాక్ చేస్తోన్న 8 కార్లు..

Highlights

ఇవి దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఎంతో ఉపయోగంగా మారాయి. రూ. 10 లక్షలకు సౌకర్యంతో పాటు భద్రత పరంగా ఇవి ఎంతో బాగున్నాయి.

Cars Under Rs 10 Lakhs: ఈ రోజుల్లో ప్రయాణం అనేది ఒక అభిరుచి కాకుండా చాలా ముఖ్యమైన అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రయాణాలు కోరుకుంటున్నారు. ఇలాంటి జర్నీ కోసం ఎక్కువగా ఉపయోగపడే SUV, MPV విభాగంలోని 10 వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఎంతో ఉపయోగంగా మారాయి. రూ. 10 లక్షల సౌకర్యంతో పాటు భద్రత పరంగా ఇవి ఎంతో బాగున్నాయి. 5 సీట్ల SUV సెగ్మెంట్‌లో టాటా మోటార్స్, రెనాల్ట్ ఇండియా, నిస్సాన్, హ్యుందాయ్, మహీంద్రా, మారుతీ సుజుకీ వంటి కంపెనీల నుంచి SUVలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత సరసమైన 7 సీట్ల కార్లలో రెనాల్ట్ ట్రైబర్ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ వాహనాలతో పర్వతాలు, సముద్రం, ఇతర ప్రధాన పర్యాటక ప్రదేశాలకు రోడ్ ట్రిప్‌లకు వెళ్లొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

రెనాల్ట్ ట్రైబర్..

రెనాల్ట్ ట్రైబర్ దేశంలోనే అత్యంత సరసమైన 7 సీట్ల MPV. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.33 లక్షలతో ప్రారంభమవుతుంది.

రెనాల్ట్ కిగర్..

దేశంలోనే అత్యంత చౌకైన SUVలలో ఒకటైన Renault Kiger ఎక్స్-షోరూమ్ ధర రూ.6.47 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్..

ఇటీవల విడుదల చేసిన Tata Nexon ఫేస్‌లిఫ్ట్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.10 లక్షల నుంచి రూ. 15.50 లక్షల వరకు ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా..

ప్రస్తుతం, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV మారుతి సుజుకి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ.8.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ వెన్యూ..

హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటైన వెన్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.77 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మహీంద్రా బొలెరో నియో..

మహీంద్రా బొలెరో నియో 7 సీటర్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.63 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మహీంద్రా XUV300..

మహీంద్రా పాపులర్ సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV XUV300 ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

నిస్సాన్ మాగ్నైట్..

దేశంలోనే అత్యంత చౌకైన సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories