Electric Vehicles: గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి టాటా వరకు.. ఈ ఎలక్ట్రిక్ కార్లపై రూ. 1.20 లక్షల తగ్గింపు..!

From MG To Tata These Electric Vehicles Become Cheaper Up To RS 1.20 Lakhs
x

Electric Vehicles: గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి టాటా వరకు.. ఈ ఎలక్ట్రిక్ కార్లపై రూ. 1.20 లక్షల తగ్గింపు..!

Highlights

Electric Vehicles: టాటా మోటార్స్, MG మోటార్ ఇండియా వంటి పెద్ద బ్రాండ్లు తమ ప్రముఖ మోడల్స్ ధరలను తగ్గించాయి.

Electric Vehicles: టాటా మోటార్స్, MG మోటార్ ఇండియా వంటి పెద్ద బ్రాండ్లు తమ ప్రముఖ మోడల్స్ ధరలను తగ్గించాయి. స్టాక్‌ను క్లియర్ చేయడానికి, అమ్మకాల లక్ష్యాలను సాధించడానికి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మహీంద్రా తన ఏకైక ఎలక్ట్రిక్ కారు XUV400 ధరను తగ్గించనప్పటికీ, 2023కి స్టాక్‌లో మిగిలిపోయిన మోడళ్లపై రూ. 4 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది.

టాటా నెక్సాన్..

టాటా నెక్సాన్ ఈవీ ధరను రూ. 1.2 లక్షలు తగ్గించింది. ఇప్పుడు దీని ధర రూ.14.49 - 19.29 లక్షల మధ్య ఉంది. Nexon EV భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన EV SUV. దీని సగటు నెలవారీ విక్రయాలు 1,750 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.

MG కూడా EV ధర కూడా..

MG మోటార్ ఇండియా కూడా దాని మధ్యతరహా ఎలక్ట్రిక్ SUV ZS EV ప్రారంభ ధరను తగ్గించింది. ZS EV ధర గణనీయంగా తగ్గించడం ఇది రెండోసారి. దీనికి ముందు అక్టోబర్-2023లో దీని ధర సుమారు రూ. 2.30 లక్షలు తగ్గింది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ. 18.98 లక్షలు. ఇది మునుపటి ఎంట్రీ-లెవల్ వేరియంట్ కంటే రూ. 3.9 లక్షలు తక్కువ. దీని ధర రూ. 22.88 లక్షలుగా నిలిచింది.

టాటా టియాగో..

టాటా నెక్సాన్ లాగానే టియాగోలో కూడా స్టాక్ మిగిలి ఉంది. MY2024 Tiago EV ధర రూ. 70,000 వరకు తగ్గించింది. ధర తగ్గింపును ప్రకటించడానికి ముందు, Tiago EV MY2023 మోడల్ రూ. 97,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవల్ EV హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో, Tiago EV సగటు నెలవారీ అమ్మకాలు 2,900 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. Tiago EV ధర ఇప్పుడు రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

MG కామెట్ EV

MG మోటార్ ఇండియా వేరియంట్‌ను బట్టి కామెట్ EV ధరను రూ. 1.4 లక్షల వరకు తగ్గించింది. కామెట్ EV సగటు నెలవారీ అమ్మకాలు 550 యూనిట్లు. కామెట్ EV ధరలు ఇప్పుడు రూ. 7.98 లక్షలకు బదులుగా రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది మునుపటి కంటే రూ. 99,000 తక్కువ. కామెట్ EV MY2023 మోడల్ కూడా స్టాక్‌ను బట్టి సుమారు రూ. 80 వేల నుంచి రూ. 1 లక్ష వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.

మహీంద్రా EV ధరలో ఎటువంటి కోత లేదు..

Tata, MG ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, మహీంద్రా తన XUV400 EV ధరలను తగ్గించబోమని తెలిపింది. మహీంద్రా ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈవో రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ, 'ప్రస్తుతం ఉన్న మహీంద్రా XUV400 EV లైనప్‌లో ధరల మెరుగుదల ఆశించడం లేదు.' XUV400 మహీంద్రా నుంచి వచ్చిన ఏకైక EV అని తెలిపారు.

దీని అప్ డేట్ మోడల్ జనవరి-2024లో భారతదేశంలో ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల వరకు ఉంది. అప్‌డేట్‌కు ముందు, ప్రారంభ ధర రూ. 15.99 లక్షలు. ఇది ప్రస్తుత ధర కంటే రూ. 50,000 ఎక్కువ. అప్ డేట్ చేసిన XUV400పై ఎటువంటి తగ్గింపు లేదు. ఇన్వెంటరీని బట్టి అమ్మబడని MY2023 స్టాక్‌పై రూ. 4 లక్షలకు పైగా తగ్గింపు అందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories